హీరో విశాల్‌ హీరోగా అభిమన్యుడు

vishalమాస్‌ హీరో విశాల్‌ హీరోగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ మూవీని ‘అభిమన్యుడు’ పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ కీలక పాత్ర పోషించారు. తెలుగు వెర్షన్‌ సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమాకు జి.హరి నిర్మాత కాగా.. పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందించాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy