హుదూద్ వచ్చినరోజే వాళ్ళు పుట్టినరోజు!

హుదూద్ ను చిన్నారులు ఎదిరించడం ఏంటని ఆలోచిస్తున్నారా! పెద్ద పెద్ద వాళ్లే దాన్ని తట్టుకోలేక తంటాలు పడితే చిన్నారులు ఏం చేశారని తల బద్దలు కోట్టుకుంటున్నారా!…. జస్ట్ ఈ స్టోరీ చూడండి అంతా మీకే అర్ధమౌతుంది. హుదూద్  పేరు వింటేనే విశాఖ వాసులకు వణుకు పుడుతోంది కదా! వైజాగ్ సిటీకి ఎంతో నష్టాన్ని మిగిల్చి వెళ్లింది ఈ తుఫాన్. ఎంతోమందికి తుఫాన్ నష్టాన్ని కలిగించినా…కొంతమంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నా…తుఫాన్ వచ్చిన 12 వ తేదీనే కొంతమంది పిల్లలు పుట్టి హుదూద్ కు సవాల్ విసిరారు.  ఒకరో ఇద్దరో కాదు.  ఏకంగా 245 మంది చిన్నారులు ఆరోజున పుట్టారు.  తుఫాన్ ప్రకటనతో అలర్ట్ అయిన ఒడిశా గవర్నమెంట్ ప్రసవానికి దగ్గర పడిన 397 మంది గర్భవతుల వివరాలు సేకరించి..వారిని దగ్గర్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చేర్పించి, కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. అవసరమైన వైద్యసేవలు అందించారు. దీంతో తుఫాన్ టైంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నారులు భూమ్మీదపడ్డారు. ఒడిశా, మల్కనగిరి, రాయగడ, గంజాం, కలహండి జిల్లాల్లో వీరు పుట్టినట్లు ఒడిశా అధికారులు చెప్పారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy