హుదూద్ బాధితుల కోసం రాజమౌళి షార్ట్ ఫిల్మ్…

హుదూద్ తుఫాన్ తో నష్టపోయిన విశాఖను ఆదుకునేందుకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళీ సరికొత్త దారిలో వెళ్తున్నారు. ఒక్కోక్కరు ఒక్కోలా విశాఖకు తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. అయితే ఈ జక్కన్న మాత్రం షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. షేర్ ది స్పిరిట్ ఆఫ్ దివాలీ-వైజాగ్ నీడ్స్ యు  పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. దీపావళికి చేసే ఖర్చులో సగం విశాఖకు పంపించాలనే కాన్సెప్ట్ తో ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇవ్వాలని, ఈ మూవీ ద్వారా మెసేజ్ పంపారు. ‘ఆ డబ్బులు వైజాగ్ పంపించే అన్నయ్యా!’ అంటూ ఒక కుర్రాడు చెప్పిన డైలాగ్ తో పాటు రానాతో ఈ షార్ట్ ఫిల్మ్ లో మెసేజ్ ఇచ్చాడు రాజమౌళీ. మళ్లీ తన మార్క్ డైరెక్షన్ తో షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు మౌళీ.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy