హుస్సేన్ సాగర్ చుట్టూ 100 ఎకరాల్లో ‘స్కై టవర్స్’

హుస్సేన్ సాగర్ చుట్టూ వంద ఎకరాల్లో స్కై టవర్స్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హుస్సేన్ సాగర్ పై ఈ రోజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ సాగర్ ప్రక్షాళనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కాల్వల ద్వారా హుస్సేన్ సాగర్ లోకి డ్రైనేజ్ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇందిరా పార్క్ లో వినాయకసాగర్ చెరువును ఏర్పాటు చేస్తామని, దానిలోనే వినాయక నిమజ్జనాలు నిర్వహిస్తామన్నారు.

సాగర్ చుట్టూ స్కై టవర్లు

  • సాగర్ ప్రక్షాళనపై సీఎస్ అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు
  • సంజీవయ్య పార్క్ లో వాల్డ్ లోనే ఎత్తైన టవర్
  • 100 ఎకరాల్లో స్కైటవర్ల నిర్మాణం
  • 40 చోట్ల టవర్లు నిర్మించేందుకు మ్యాప్ పరిశీలించిన సీఎం
  • టవర్లకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశం
  • సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే స్కైటవర్లు

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy