హూజీ టెర్రరిస్టుకి ఆగస్ట్ 2న ఉరిశిక్ష

death-penaltyశ్రమజీవి ఎక్స్ ప్రెస్ పేలుళ్ల కేసులో తుది తీర్పు వెలువరించింది ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్  కోర్టు. ఈ కేసులో నిందితులలో ఒకరైన ఉబేద్ ఉర్ రెహ్మన్ కు ఉరిశిక్ష విధించింది కోర్టు. ఆగస్టు  రెండున శిక్షను అమలు చేయనున్నారు.  ఉబేద్ హూజీ టెర్రరిస్ట్. బంగ్లాదేశ్ కు చెందిన ఉబేద్.. 2005 జూలై 28న ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 58 మంది సాక్షులను విచారించి ఈ తీర్పు ఇచ్చింది. న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన హరిహరపూర్ చేరుకోగానే పేలుడు జరిగింది. రైల్వే యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయగా.. 11 ఏళ్ల తర్వాత కేసులో తుది తీర్పు శుక్రవారం వెలువడింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా.. 60 మంది గాయపడ్డారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy