హృతిక్, కత్రినా బ్యాంగ్ బ్యాంగ్..!

hritik-katrina-bang-bangజిందగీ న మిలేగా దొబారా సినిమా తర్వాత హృతిక్ రోషన్, కత్రినాకైఫ్ మరోసారి రొమాన్స్ చేస్తున్నారు. ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా కోసం ఈ హాట్ పెయిర్ మరోసారి జట్టుకట్టింది. ఈ పూర్తి యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీని ‘బచ్ నా హే హసీనా’ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. టామ్ క్రూయిజ్, క్యామెరూన్ దియాజ్ నటించిన హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ మూవీ ‘నైట్ అండ్ డే’ కు రీమేక్ ఈ సినిమా. ఈ సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. హృతిక్ నటించిన క్రిష్-3 రిలీజైన ఏడాదికి ఈ సినిమా రిలీజవుతోంది. అలాగే కత్రినా నటించిన ధూమ్-3 కూడా రిలీజై వన్ ఇయర్ దాటింది. లేటెస్టుగా ఈ బ్యాంగ్ బ్యాంగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేనంత హాట్ అండ్ రొమాంటిక్ గా ఈ ఇద్దరు నటించిన ఈ పోస్టర్.. ఫ్యాన్స్ భలే అట్రాక్ట్ చేస్తోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy