హెచ్.సి.యులో PhD స్టూడెంట్ సూసైడ్

RohitVemula_hcuహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యలు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న మరో PhD స్కాలర్ సూసైడ్  చేసుకున్నాడు. రోహిత్ మరణానికి  వర్సిటీ అధికారులే కారణమంటూ  ఆందోళనకు దిగాయి దళిత సంఘాలు. నిందితులపై కేసు పెట్టే వరకూ పోస్టుమార్టం జరగనివ్వమంటున్నాయి. రోహిత్ మృతికి నిరసనగా ఇవాళ బంద్ కు పిలుపు నిచ్చాయి విద్యార్థి సంఘాలు.

పీహెచ్డీ స్కాలర్ సూసైడ్ తో సెంట్రల్ యూనివర్సిటీలో  ఉద్రిక్తత ఏర్పడింది. సైన్స్ అండ్ సొసైటీ డిపార్ట్ మెంట్ లో పీహెచ్డీ సెకండియర్ చదువుతున్న వేముల రోహిత్ నిన్న సాయంత్రం హాస్టల్ గదిలో ఊరేసుకొని చనిపోయాడు. గుంటూరుకు చెందిన రోహిత్ మరణానికి యూనివర్సిటీ అధికారులే కారణమని ఆరోపిస్తున్నాయి విద్యార్థి సంఘాలు.  ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపు నిచ్చాయి. స్సాట్…

గతేడాది ఉగ్రవాది యాకూబ్ మెమన్  ఉరిశిక్షకు వ్యతిరేకంగా  వర్సిటీలో నిరసన తెలిపారు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్… విద్యార్థులు. వాళ్లను జాతిద్రోహులంటూ ఓ ABVP నాయకుడు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది. దీనిపై  ABVP నాయకుడు అపాలజీ చెప్పారు. ఆ తర్వాత ఇదే వ్యవహారంలో తనపై ASA నాయకులు దాడి చేశారంటూ… ఏబీవీపీ నాయకుడు కంప్లైంట్ చేయడంతో  పోలీస్ కేసు నమోదైంది. వరుస ఘటనలపై విచారణ కమిటీ వేసింది యూనివర్శిటీ. ఏబీవీపీ నాయకుడికి, ఏఎస్ఏకు చెందిన ఐదుగురు విద్యార్థులకు నోటీసులిచ్చారు. ఐదుగురు స్టూడెంట్స్ ను సస్పెన్సన్ చేశారు. రాజకీయ జోక్యంతో విషయం  కొత్తమలుపు తిరిగింది.

వర్శిటీ వివాదంలోకి ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎంట్రీ ఇచ్చారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా కేంద్ర హెచ్చార్డీ శాఖకు లేఖ రాశారు. మరోవైపు విద్యార్థుల సస్పెన్షన్ పై దళిత విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఈ ఇష్యూపై చర్చించేందుకు భేటీ అయిన వర్సిటీ  ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సస్పెన్షన్ ఎత్తివేయకుండా ఐదుగురు స్కాలర్లపై కఠినమైన ఆంక్షలు విధించింది. దీనిపై విద్యార్థి సంఘాలు సీరియస్ గా రియాక్టయ్యాయి. సస్పెన్షన్ ఎత్తేయాలంటూ కొన్ని రోజులుగా  ఆందోళన చేస్తున్నాయి. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మనస్తాపం చెందిన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు.  హెచ్.సి.యు. ఉన్నతాధికారుల సామాజిక వివక్ష వల్లే రోహిత్ చనిపోయాడని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాలు.

రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.. మాజీ ఎంపీ వివేక్. విద్యార్థులను సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టారు.  వర్సిటీల్లో.. అధికారులు వివక్ష ప్రదర్శించడం మంచి పద్ధతి కాదన్నారాయన. రోహిత్ మరణానికి  కారణమైన వారిపై  అట్రాసిటీ కేసు పెట్టాలంటున్నాయి దళిత విద్యార్థి సంఘాలు. అప్పటివరకు పోస్టుమార్టం జరగనివ్వమంటున్నాయి. దీంతో వర్సిటీలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy