హెల్త్ ఎమర్జెన్సీ దిశగా కాశ్మీర్‌

A Kashmiri man evacuates an elderly woman to a higher ground at a flooded road in Srinagarభారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాశ్మీర్‌ ప్రజలకు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉండటంతో హెల్త్ ఎమర్జెన్సీని విధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అన్నిచోట్లా నీళ్ళు నిలిచసోవడంతో మున్సిపాలిటీ సిబ్బంది పనుల్లోకి రాలేని పరిస్థితి ఉండడంతో రెండు వారాలుగా శ్రీనగర్‌లో చెత్తా చెదారం భారీగా పేరుకుపోయింది. దీనికి తోడు వరదల్లో మృతి చెందిన జంతువులు, వాటి కళేబరాలు ఇళ్ళ దగ్గరికి కొట్టుకొస్తుండడంతో ప్రజలు అంటువ్యాధులు వస్తాయని భయపడుతున్నారు. అంటువ్యాధులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరించడానికి 30మంది డాక్టర్లు, 300 మంది సిబ్బందిని శ్రీనగర్ పంపినట్లు సెంట్రల్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ చెప్పారు.
వరదలతో అతలాకుతలమైన కాశ్మీర్ ప్రజలకు సహాయంగా ఇప్పటికే రూ.10 కోట్లను ప్రకటించిన తెలంగాణ గవర్నమెంట్ తాజాగా అక్కడి ప్రజలకు స్వచ్చమైన నీళ్ళను అందించాలని నిర్ణయించింది. దీని కోసం 50 వాటర్ ప్యూరి ఫయిర్స్ ను జమ్మూ కాశ్మీర్ కు పంపనుంది. రోడ్లు, కమ్యూనికేషన్ సిస్టం, హాస్పిటళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు భారీగా దెబ్బతినడంతో వాటిని బాగు చేయడానికి రూ.5వేల కోట్లనుంచి రూ.6వేలకోట్ల వరకు ఫండ్స్ అవసరమని  కాశ్మీర్ రాష్ట్ర రెవెన్యూ శాఖ సెక్రెటరీ వినోద్‌కౌల్ అన్నారు. రెండు వారాలుగా సహాయ చర్యలు కొనసాగిస్తున్న ఆర్మీ ఇప్పటి వరకు దాదాపు 2లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy