హెల్త్ బులెటిన్ విడుదల : నిలకడగానే కరుణానిధి ఆరోగ్యం

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు వారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం రాత్రి 9 గంటలకు తాజా బులెటిన్‌ ను విడుదల చేశారు. వైద్య బృందం పూర్తి పర్యవేక్షణలో కరుణానిధికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటికే ఆయన బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి బయటకు చేరుకున్న డీఎంకే కార్యకర్తలను అదుపుచేసేందుకు పోలీసులు భారీగా మొహరించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy