హేమా ఉపాధ్యాయ్ ను చంపింది ఆమె భర్తే

chintan-upadhyay 111ముంబైకి చెందిన ఫేమస్ ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ్, ఆమె తరపు లాయర్ హరీష్ భంబానీ జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. ఆమె భర్త చింతన్ ఉపాధ్యాయే హేమాను చంపించినట్టు నిర్ధారించారు పోలీసులు. రెండు రోజుల క్రితం హేమా భర్తను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఇన్వెసెస్టిగేషన్ లో అసలు నిజాలు రాబట్టారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా నడుస్తున్న కోర్టు కేసులు వదిలించుకోవడం కోసం ప్లాన్ ప్రకారం హేమాను చంపించినట్టు నిందితుడు అంగీకరించాడు. ఎంక్వైరీ కోసం చింతన్ కు జనవరి 1 వరకు పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. చింతన్, హేమా దంపతులిద్దరూ చిత్రకారులే. 1998లో వీరికి వివాహం అయింది. గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. 2010 లో విడాకుల కోసం అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత భర్త నుంచి వేధింపులు పెరగడంతో 2013లో చింతన్ పై కేసు పెట్టింది హేమా. విడాకులు ఇప్పించి భరణం కింద నెలకు లక్షరూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న చింతన్ ఆమెను చంపాలని  డిసైడయ్యాడు. కిరాయి ముఠాతో బేరం కుదుర్చుకున్నాడు.

రెండు నెలల క్రితం విద్యాధర్  అనే వ్యక్తితో హేమా మర్డర్ కి ప్లాన్ చేశాడు. డిసెంబర్  12న తన మనుషులతో హేమకు ఫోన్  చేయించాడు విధ్యాదర్. తమ దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయని.. ఇవి చింతన్  నుంచి విడాకులు తీసుకునేందుకు ఉపయోగపడుతాయని హేమకు చెప్పారు. దీంతో  తన లాయర్  హరీశ్ తో కలిసి హేమా వేర్ హౌస్ కు వెళ్లడం, అక్కడ విద్యాధర్  వీరిద్దరినీ చంపేసి అట్టపెట్టెలో కుక్కి.. మృతదేహాలను సమీపంలోని చెత్తకుప్పల వద్ద పడేయడం జరిగింది. డిసెంబర్  13న మృతదేహాలను గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసులో ఐదుగురు నిందితులతో పాటు హేమా భర్తను అరెస్ట్ చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy