‘హేయ్ పిల్లగాడ’ టీజర్ కు ఫ్యాన్స్ ఫిదా..!

51503136489_625x300‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళీ బ్యూటీ సాయి పల్లవి.. మరో మూవీతో అలరించడానికి రెడీ అవుతోంది. అమ్మ‌డు న‌టించిన ‘క‌ల్ఫీ’ అనే మ‌ల‌యాళ చిత్రాన్ని తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాకి ‘ఫిదా’ మూవీలోని సూపర్ హిట్ పాటలో వ‌చ్చే ‘హేయ్ పిల్లగాడ’ అనే లిరిక్స్ ను టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఇటీవల టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌డంతో  మూవీపై భారీ అంచ‌నాలు పెంచింది. దుల్క‌ర్ స‌ల్మాన్, సాయి ప‌ల్ల‌వి మెయిన్ రోల్ లో ‘క‌ల్ఫీ’ తెర‌కెక్క‌గా డివి కృష్ణ స్వామి డ‌బ్బింగ్ రైట్స్ ద‌క్కించుకున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాని తెలుగులో విడుద‌ల చేయ‌నున్నారు. సమీర్ తాహిర్ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. మ‌రి ‘ఫిదా’ లిరిక్స్ ని మూవీ టైటిల్ గా పెట్టిన చిత్ర యూనిట్ ఎంత వ‌ర‌కు లాభాలు రాబ‌డుతుందో చూడాలి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy