హైకోర్టులో వరవరరావుకు చుక్కెదురు

హైదరాబాద్‌ : విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు వరవరరావుకు ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై మహారాష్ట్ర పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను నిన్న(శుక్రవారం) హైకోర్టు కొట్టేసింది. దీంతో ఏ క్షణమైన పూణే పోలీసులు వరవరరావును అరెస్ట్‌ చేయవచ్చు. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని పుణేకు ఆయనను తరలించేందుకు జారీ అయిన ట్రాన్సిట్‌ వారెంట్‌ అమలును ఇటీవల తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది హైకోర్టు. ఆ గడవు ముగిసేలోపు పూణే పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy