హైకోర్టు విభజనతోనే రిక్రూట్ మెంట్స్ : శ్రీనివాస్ గౌడ్

ASSEMBLEYరాష్ట్రంలో అనేక అంశాలు హైకోర్టులో ఉన్నాయన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మంగళవారం (మార్చి-13)న జరిగిన అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. హై కోర్టు విభజన విషయంలో కేంద్రానికి బాధ్యతలేదా అని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రాలు విడిపోయినప్పుడు సరైన విధానంతో కేంద్రం పనిచేయాలన్నారు. విభజన జరిగినప్పుడు ఆప్షన్ అడుగుతారని, దీంతో రిక్రూట్ మెంట్ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు.

ప్రతి అంశంలోనూ హైకోర్టుకు వెళ్తున్నారని, విభజన కాకపోవడంతో రిక్రూట్ మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. త్వరగా హైకోర్టు విభజన జరిపితేనే తెలంగాణలో ఉద్యోగాలు ఉంటాయన్నారు. చాలా కేసులు కూడా పరీక్షారం కావడంలేదన్నారు. ఉమ్మడి హైకోర్టు కావడంతో ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. దీనిపై త్వరగా క్లారిటీ ఇవ్వలని..తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు శ్రీనివాస్ గౌడ్

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy