‘హైడ్రోజన్ బాంబు’ను పరీక్షించిన నార్త్ కొరియా

north koreaఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని చాటుకుంది. హైడ్రోజన్ బాంబు విజయవంతంగా ప్రయోగించి.. ప్రపంచానికి తానేంటో నిరూపించుకుంది. బుధవారం ఉదయం పరీక్ష నిర్వహించారు. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలో నిర్వహించిన పరీక్షల కారణంగా ఆ ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు కూడా భూకంపాన్ని ధ్రువీకరించారు. కిల్జూ పట్టణంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం హైడ్రోజన్ బాంబు పరీక్ష కారణంగా వచ్చినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. అణుబాంబు కన్నా శక్తివంతమైనదిగా హైడ్రోజన్ బాంబును ప్రకటించింది నార్త్ కొరియన్ గవర్నమెంట్.

ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగంపై సీరియస్ అవుతున్నాయి ప్రపంచ దేశాలు. ఈ చర్యను తీవ్రంగా ఖండించింది జపాన్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించారని విమర్శించింది అమెరికా. నార్త్ కొరియాతీరు రెచ్చగొట్టే విధంగా ఉందన్నాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy