హైడ్రోజన్ బాంబ్ అసలు కథ ఇదీ..!

hydrozen bombఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగం… ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటిదాకా అణుబాంబు విస్పోటనాలను చూసి… ఉలిక్కపడ్డ… ప్రపంచానికి… ఉత్తర కొరియా చర్య… దిగులు కలిగిస్తోంది. అణుబాంబు కంటే వేలరెట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును ప్రత్యర్థులపై ఉపయోగిస్తే… సృష్టి వినాశనమే. ఈ పరిస్థితుల్లో హైడ్రోజన్ బాంబ్ తయారీ, ఉపయోగంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది.

రెండో ప్రపంచ యుద్దకాలంలో… జపాన్ లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులతో దాడి చేసింది. రెండు బాంబులు… రెండు పట్టణాలను శ్మశానంగా మార్చేశాయి. 2లక్షలకు పైగా జనం చనిపోయారు. అయితే… అణుబాంబుల కాలం ముగిసి… హైడ్రోజన్ బాంబుల శకం వచ్చింది. హైడ్రోజన్ బాంబ్, అణుబాంబ్. ఒకటి లేకుంటే మరొకటి లేదు. హైడ్రోజన్ బాంబ్ పేలాలంటే… దానితో పాటు అణుబాంబును కూడా పేల్చాల్సిందే.

అణుబాంబ్ కేంద్ర విచిత్తి ప్రక్రియ ద్వారా జరుగుతుంది. హైడ్రోజన్ బాంబ్ కేంద్రక సంలీనం ద్వారా పేలుతుంది. కేంద్రక విచిత్తి కంటే… కేంద్రక సంలీనం ద్వారా ఎక్కువ శక్తి విడుదలవుతుంది. దీనికోసం హైడ్రోజన్ ఐసోటోపులైన్ డ్యుటీరియం, ట్రీటియంలను ఉపయోగిస్తారు. రెండు కేంద్రకాలు కలసిపోవాలంటే… అత్యధిక ఉష్ణోగ్రతలు కావాలి. డ్యుటీరియంను… ట్రీటియంతో సంలీనం చెందించాలంటే.. ఐదు కోట్ల డిగ్రీ సెంటీగ్రేడ్ ల ఉష్ణోగ్రత అవసరం. అదే ట్రీటియంను ట్రీటియంతోనే సంలీనం చెందించాలంటే… 40కోట్ల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలి. ఇంత ఉష్ణోగ్రతను పుట్టించాలంటే… అణుబాంబు పేల్చాలి. దానిని పేల్చినప్పుడు… జరిగే కేంద్రక విచిత్తితో వెలువడే ఉష్ణోగ్రతతో… కేంద్రక సంలీనం జరిగి… హైడ్రోజన్ బాంబ్ పేలుతుంది. అందుకే హైడ్రోజన్ బాంబ్ లోనే అణుబాంబ్ లను అమరుస్తారు. హైడ్రోజన్ బాంబులు పేలినప్పుడు విడుదలయ్యే శక్తి మెగాటన్నుల్లో ఉంటుంది. 1961లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన హైడ్రోజన్ బాంబ్… జార్ బాంబా 50మెగా టన్నుల శక్తిని విడుదల చేసింది. ఇప్పటివరకు తయారు చేసిన హైడ్రోజన్ బాంబుల్లో ఇదే పవర్ ఫుల్.

హైడ్రోజన్ బాంబులను థర్మన్యూక్లియర్ బాంబులు కూడా అంటారు. వీటిని చిన్నసైజులో కూడా తయారు చేసి మిస్సైల్స్ కి అమర్చే అవకాశముంది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు ఎప్పుడో హైడ్రోజన్ బాంబులను తయారు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉత్తరకొరియా కూడా చేరింది. గతంలో… భారత్ కూడా హైడ్రోజన్ బాంబ్ తయారు చేసిందని వార్తలొచ్చాయి. కానీ అది పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు. హైడ్రోజన్ బాంబ్ పేలితో… దేశాలకు దేశాలే… వరల్డ్ మ్యాప్ నుంచి తుడిచిపెట్టుకుపోతాయి. అందుకే… అదంటే అంత భయం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy