హైదరాబాద్‌లో వాంకోవర్ ఫిల్మ్ స్కూల్

SCHOOL KTRహైదరాబాద్ లో వాంకోవర్ ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు శుక్రవారం(నవంబర్-17)న రాష్ట్ర ప్రభుత్వం-కెనడా మధ్య ఒప్పందం కుదిరింది. కెనడా వాణిజ్యశాఖ మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ శుక్రవారం టీహబ్‌ను సందర్శించి మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఒప్పందంపై మంత్రి కేటీఆర్, కెనడా మంత్రి ఫ్రాంకోయిస్ సంయుక్త ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్ రంగాల్లో అభివృద్ధికి మెరుగైన అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. కెనడాలో పర్యటించాల్సిందిగా కేటీఆర్‌ను ఫ్రాంకోయిస్ ఆహ్వానించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy