హైదరాబాద్ అభివృద్ధికి సీఎం భారీ ప్రణాళిక

cm-kcrహైదరాబాద్ నగరాభివృద్దిపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేశారు. మంత్రులు KTR, హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, మేయర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మంచినీటి సరఫరాకు శాశ్వత ప్రాతిపదికన రెండు రిజర్వాయర్లు నిర్మించాలని సీఎం సూచించారు. గోదావరిపై కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రిజర్వాయర్ ను, కృష్ణా నదిపై కడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మరో రిజర్వాయర్ ను నింపాలన్నారు. గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేసి, 10-15 టిఎంసిల నీరు నిల్వ ఉండే విధంగా రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. దీనికోసం సాంకేతిక అంశాలను పరిశీలించి, వెంటనే పనులు మొదలుపెట్టాలని సూచించారు.

హైదరాబాద్ లో గ్రీనరీ పెంచాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. నగరం చుట్టూ ఉన్న వేలాది అటవీ భూముల్లో చెట్లు పెంచాలన్నారు. నాగోల్, నారపల్లి ప్రాంతాల్లో దాదాపు ఏడెనిమిది వేల ఎకరాల అటవీ భూమి.. శంషాబాద్ విమానాశ్రాయం ప్రాంతంలో ఓఆర్ఆర్ అవతల మరో 16వేల ఎకరాల అటవీ భూమి.. నర్సాపూర్ లో దాదాపు 40 వేల అటవీ భూమి ఉందనీ.. ఈ ప్రాంతాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. మున్సిపల్ శాఖ పేషీలో నగరంలో పచ్చదనం పెంచే కార్యక్రమం పర్యవేక్షించడం కోసం ఓ ఐఎఫ్ఎస్ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించాలని సూచించారు.

నగరాభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం పెంచాలనీ.. అందుకోసం బస్తీ కమిటీలు వేయాలన్నారు సీఎం. ప్రతీ డివిజన్ కు 10 కమిటీలు ఉండాలనీ.. 15 రోజుల్లోగా కమిటీల నియామకం పూర్తి కావాలన్నారు. ప్రజలందరినీ కలుపుకుని బస్తీలో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత కాపాడడం లాంటి విషయాల్లో ఆ కమిటీలు కీలకంగా పనిచేస్తాయన్నారు.

నగరంలో, శివారు ప్రాంతాల్లో చాలా చెరువులున్నాయన్న సీఎం.. వాటిలో పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్యం చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మురికి నీరు చెరువుల్లోకి చేరకుండా ప్రత్యేక కాల్వలు నిర్మించాలన్నారు. కొత్తగా కట్టే నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అధికారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలనీ.. తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటమన్నారు.

సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ది చేయాలన్నారు. మూసీ నది దాటడానికి పలు చోట్ల వంతెనలు కట్టాలన్నారు. సిటీలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలనీ.. ఇండ్లపై తీగలను తీసెయ్యాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy