హైదరాబాద్ ఐటీకి అడ్డా కావాలి..

Kcr3    హైదరాబాద్ ఐటీకి అడ్డాగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. ఈ రోజు నానక్ రామ్ గూడలోని  వేవ్ రాక్ ఐటీ పార్క్ ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలుకుతోందన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా వచ్చి తనను కలవోచ్చని కేసీఆర్ అన్నారు.  హైదరాబాద్ లో ఉండే వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని ఆయన అన్నారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని ఆయన అన్నారు.

హైదరాబాద్ కు అద్భుత మైన భవిష్యత్తు ఉందని..నగరాన్ని డిజిటల్ సిటీగా మారుస్తామన్నారు. వేవ్ రాక్ బిల్డింగ్ waverock ITను చూస్తుంటే విదేశాల్లో ఉన్నంత ఫీలింగ్ వచ్చిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తామన్నారు కేసీఆర్. కొత్త ఆవిష్కరణలకు హైదరాబాద్ వేదిక కావాలని ఆయన అన్నారు. పెట్టుబడి దారులకు సింగిల్ విండో సిస్టమ్ ను ఎనౌన్స్ చేస్తామన్నారు. హైదరాబాద్ ను ఐటీ రంగంలో దేశంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

 

 

waverock_

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy