హైదరాబాద్ కు ఎన్డీఏ రాష్టపతి అభ్యర్ధి కోవింద్

KOVINDఎన్డీయే  అభ్యర్థి  రామ్ నాథ్ కోవింద్  ఇవాళ హైదరాబాద్  రానున్నారు. ఉదయం 7 గంటలకు  ఢిల్లీ నుంచి  బయల్దేరి.. 9:30 నిమిషాలకు  బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు  . 10 గంటలకు హరితప్లాజాలో  బీజేపీ ఎమ్మెల్యేలు,  ఎంపీలు కోవింద్ ను కలుస్తారు.  పదిన్నరకు  అదే హోటల్ లో  టీడీపీ ఎమ్మెల్యేలు  కూడా కోవింద్ ను కలుసుకుంటారు.  11.15కు  హోటల్ పార్కు హయత్ లో  ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో  కోవింద్ సమావేశమవుతారు.  మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు జల విహార్ లో  సీఎం కేసీఆర్ తో  సహా మంత్రులు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు రాంనాథ్ కోవింద్  తో  సమావేశం కానున్నారు. ఇక్కడే  సీఎం కేసీఆర్ తో కలిసి  కోవింద్ లంచ్ చేస్తారు.

కోవింద్ కు  స్వాగతం పలికేందుకు  టీఆర్ఎస్ నేతలు  ఏర్పాట్లు చేశారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో  రామ్ నాథ్ కోవింద్ కు  రాష్ట్ర మంత్రులు,  ఎంపీలు ఘన స్వాగతం పలకనున్నారు. డిప్యూటీ సీఎంలు  కడియం శ్రీహరి… మహమూద్ అలీ.. మంత్రులు హరీష్ రావు,  ఈటల రాజెందర్, నాయిని నర్సింహరెడ్డి తో  పాటు పార్లమెంటరీ పార్టీ నాయకులు  కేశవరావు, లోక్ సభ పక్ష  నేత  జితేందర్ రెడ్డి …విమానాశ్రయంలో కోవింద్ కు  స్వాగతం పలకనున్నారు. ఉదయం 11గంటల  లోపే  జలవిహార్ చేరుకోవాలని మంత్రులు,  ఎంపిలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు , కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లను  కేసీఆర్ అహ్వానించారు.  ఆయనే స్వయంగా  ప్రజాప్రతినిధులను  కోవింద్ కు పరిచయం  చేయనున్నారు. రాంనాథ్  కోవింద్  బేగంపేట ఎయిర్ పోర్టు  నుంచి జలవిహార్ కు  వెళ్ళే దారిలో  హోర్డింగ్ లు ఏర్పాటు  చేసింది టీఆర్ఎస్.

కేంద్ర మంత్రులు  అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు,  బండారు దత్తాత్రేయ పర్యటనలో పాల్గొంటున్నారు.  మధ్యాహ్నం 2 గంటలకు  ప్రత్యేక విమానంలో  బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి  నేతలు విజయవాడకు  వెళ్లనున్నారు. అక్కడ ఏపీ  సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు,  ఎంపీల తో  సమావేశమై  రాత్రికి ఢిల్లీ తిరిగివెళ్లనున్నారు కోవింద్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy