హైదరాబాద్ జూలో అరుదైన పాము

sankeహైదరాబాద్‌ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ సమీపంలోని మసీదులో గత నెల(జూలై 28) ఓ పాము కనిపించింది. ఆ పామును అనిమల్ కీపర్ ప్రభాకర్ పట్టుకున్నారు. అది కేవలం 46 సెంటిమీటర్ల పొడవు ఉంది. రాష్ట్రంలో అరుదుగా కనిపించే పాముగా గుర్తించినట్లు జూపార్క్ క్యూరేటర్ శివానీ డొంగ్రే తెలిపారు. ఎల్లో కాలర్డ్ ఓల్ఫ్ జాతికి చెందిన ఈ పాములు దక్షిణాదిలో అధికంగా కనిపిస్తాయని, విషపూరితం కావని చెప్పారు ఆమె. ప్రస్తుతం జూ పార్క్‌లోని పాముల ఎన్‌క్లోజర్‌లలో ఈ పామును వదిలిపెట్టినట్టు తెలిపారు డొంగ్రే. దీని తల భాగంలో పసుపు రంగు ఉంటుంది. చికట్లోనూ తల భాగం మెరుస్తూ ఉంటుంది. ఇలాంటి చాలా అరుదుగా ఉంటాయని తెలిపారు జూ అధికారులు. ఇది 46 సెంటీమీటర్ల పొడవు ఉంది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy