హైదరాబాద్- బ్యాంకాక్ కు.. 2 స్పైస్ జెట్ విమానాలు

హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు డైలీ రెండు స్పైస్ జెట్ విమానాలను నడపనున్నట్లు తెలిపింది స్పైస్ జెట్ సంస్థ. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో.. మొదటి టికెట్ ను మంత్రి కేటీఆర్ కు అందజేశారు సంస్థ అధికారులు. ప్రయాణికులకు ఈ సేవలు అక్టోబర్-10 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. బ్యాంకాక్ తో పాటు ..గౌహతికి మరో విమాన సర్వీసును నడపనున్నట్లు తెలిపారు. తొలి స్వదేశీ విమానయాన సంస్ధ స్పైస్  జెట్  తో హైద్రాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభంకావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు..ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy