హైదరాబాద్ రియల్ బూమ్: ఎకరం రూ.42.59కోట్లు

Site picsహైదరాబాద్ రియల్ కళ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాయి రాయదుర్గం భూమలు. కోట్లలో రేట్లు పలుకుతూ… బంగారు భూములు అనిపించుకుంటున్నాయి. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. గతేడాది నిర్వహించిన వేలానికి డబుల్ రేట్లు పలికాయి. మొత్తం ఐదు లాట్లలో 15 ఎకరాల భూముల విక్రయానికి టీఎస్‌ఐఐసీ ఈ నెల 10న ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గం ప్రాంతంలో 2.84 ఎకరాల లాట్‌కు గరిష్టంగా గజానికి రూ. 88 వేల చొప్పున ధర చెల్లించేందుకు ఒక బిడ్డర్‌ టెండర్‌ దాఖలు చేశారు. దీంతో ఇక్కడి భూమి ఎకరానికి రూ. 42.59 కోట్ల ధర పలికినట్లయిది. గతంలో ఏడాదిన్నర కిందట ఇదే ప్రాంతంలో టీఎస్‌ఐఐసీ వేలం వేసిన భూములకు గరిష్టంగా ఎకరానికి రూ. 29 కోట్ల ధర వచ్చింది.

రాయదుర్గం ప్రాంతంలోనే 2.15 ఎకరాల మరో లాట్‌కు నిర్వహించిన టెండర్లలో గజానికి రూ. 60,600 చొప్పున కొనుగోలు చేసేందుకు మరో బిడ్డర్‌ ముందుకొచ్చారు. దీనికి ఎకరానికి రూ. 29.33 కోట్లు ధర పలికినట్లు స్పష్టమవుతోంది. ఇంకా టెండర్లు ఖరారు చేయకపోవటంతో బిడ్లు దాఖలు చేసిన సంస్థలు, వ్యక్తుల పేర్లను టీఎస్‌ఐఐసీ యాజమాన్యం వెల్లడించ లేదు. ఈ విడత భూముల విక్రయంతో టీఎస్‌ఐఐసీకి రూ. 185 కోట్ల ఆదాయం సమకూరుతుందని టీఎస్‌ఐఐసీ వర్గాలు అంచనా వేశాయి. ప్రధానంగా హైదరాబాద్‌ సుస్థిర నగరాభివృద్ధి, శాంతిభద్రతలు, ఐటీ రంగ వృద్ధి కారణంగానే భూముల విక్రయానికీ విశేష స్పందన లభించిందని టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy