హైదరాబాద్ లవబుల్ సిటీ: కేటీఆర్

C4SEhFYUkAEvjkOక్లీన్, గ్రీన్, స్మార్ట్, లవబుల్ సిటీ హైదరాబాద్ అని అభివర్ణించారు మంత్రి కేటీఆర్. మారియట్ హోటల్‌లో నేషనల్ అర్బన్ డెవలప్‌మెంట్ సమ్మిట్‌ను ఇవాల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రూప్‌టాప్ సోలార్ ప్రాజెక్టుకిగాను టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డికి అవార్డును అందజేశారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మెరుగైన జీవనం కోసం జనం పట్నం బాటపడుతున్నారన్నారు. నగర పంచాయతీలు, పట్టణాలు, నగరాలను తీర్చిదిద్దాలన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ సిటీపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు కేటీఆర్. దేశంలోనే అతి పెద్ద తాగునీటి ప్రాజెక్టు మిషన్ భగీరథ కింద ఇంటింటికీ ఉచితంగా తాగునీరు అందిస్తున్నమని వెల్లడించారు ఆయన. భవిష్యత్‌లో ఇంటింటికీ ఇంటర్నెట్ అందిస్తామన్నారు కేటీఆర్. టోక్యో తరహాలో హైదరాబాద్ క్లీన్ అథారిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు కేటీఆర్. సిటీలో ఉన్న 1160 పరిశ్రమలను దశలవారీగా తరలిస్తామని వెల్లడించారు ఆయన.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy