హైదరాబాద్ లో ఇళ్ళ కోసం ప్లాన్ !

houseగ్రేటర్లో సామాన్యుడి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన హౌజింగ్ స్కీంలు మంచి ఫలితాలు ఇవ్వకపోవడంతో..  సర్కారు.. అందుకు భిన్నంగా డబుల్ బెడ్ రూం స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీంలో భాగంగా మోడల్ హౌస్ లను నిర్మించాలని సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీ పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. దసరా పండుగకు ముందే మోడల్ హౌజ్ లను పూర్తి చేసి, పండుగకు లబ్దిదారులకు అందించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. ఆ తర్వాత నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ స్కీంను ఇంప్లిమెంట్ చేయాలని బల్దియా అధికారులు చూస్తున్నారు.

జంటనగరాల్లో.. పూర్ పీపుల్  నివసిస్తున్న మురికివాడల్లోనే 5 లక్షల ఖర్చుతో పక్కా ఇళ్లను నిర్మిస్తామని సిఎం కేసిఆర్ హమీ ఇచ్చారు. అధికారులు కూడా ఇందుకు అవస ర మైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శివారు, సిటీ ప్రాంతాల్లో వేర్వేరు అంచనా వ్యయాలతో ఇళ్ల నిర్మాణానికి ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నారు. మురికివాడల్లో నివసిస్తున్న పేదలను ఒప్పించి, వారున్న చోటే బహుళ అంతస్తు భవనాలను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది బల్దియా. తాగునీరు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ ఫెసిలిటీస్ పైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలనుకుంటున్నారు. నగరంలో ఎన్ని స్ల మ్ లున్నాయి..ఎన్ని ఇళ్లు కట్టాలి అనే అంశంపై డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రెడీ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. తొలి విడతగా ఐడిహెచ్ కాలని హ్యండ్ ఓవర్ సెర్మనీని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేయాలని బల్దియాకు ఆర్డ ర్స్ అందాయి.

డబుల్ బెడ్ రూం స్కీం అమలు చేసేందుకు…. స్థానిక సంస్థల కోటా కింద బల్దియా,.. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నందున నిధుల కొరత ఉండదనేది ఓఅంచనా. అన్ని అనుకున్నట్లు జరిగితే గ్రేటర్ లో పేదోడి సొంతింటి కల త్వరలోనే నెరవేరుతుందనడంలో సందేహంలేదు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy