హైదరాబాద్ లో ఇవాళ, రేపు ట్రాఫిక్ ఆంక్షలు


భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహూల్ గాంధీ ఇవాళ, రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటన, బహిరంగ సభల క్రమంలో సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీస్ అధికారులు 13, 14వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శేరిలింగంపల్లిలో సోమవారం జరిగే బహిరంగ సభ కారణంగా సాయంత్రం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు ఉంటాయని…ప్రజలు సహకరించాలని కోరారు. స‌భ‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు..దారి మళ్లింపులు

.. ట్రిపుల్ ఐటీ, గచ్చిబౌలి, HCU, గుల్‌మోహర్ పార్క్, నలగండ్ల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాదారులు ట్రిపుల్ ఐటీ, విప్రో, గౌలిదొడ్డి, గోపన్న పల్లి, నలగండ్ల వైపు వెళ్లాలి.
.. ట్రిపుల్ ఐటీ, గచ్చిబౌలి, BHEL వైపు వెళ్లే వాహనదారులు HCU, మజీద్‌బండా, రాఘవేంద్ర కాలనీ, సీఆర్ ఫౌండేషన్, హఫీజ్‌పేట్, ROB, ఆల్విన్ జంక్షన్, చందానగర్, BHEL, లేదా గచ్చిబౌలి, HCU, మజీద్‌బండా, కొత్తగూడ, CR ఫౌండేషన్, లేబర్ అడ్డా, హఫీజ్‌పేట్ ఆర్‌ఓబీ, ఆల్విన్ జంక్షన్, చందానగర్, BHEL మీదుగా ప్రయాణించాలి.
.. నలగండ్ల, తెల్లాపూర్, గచ్బిబౌలి వైపు నుంచి వచ్చే వాహనదారులు గోపన్నపల్లి, గౌలిదొడ్డి, ట్రిపుల్ ఐటీ, గచ్చిబౌలి వైపు వెళ్లాలి.
..BHEL, ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి వైపు నుంచి వాహనాదారులు BHEL, చందానగర్, ఆల్విన్ జంక్షన్, హఫీజ్‌పేట్, ROB, సీఆర్ ఫౌండేషన్, రాఘవేంద్ర కాలనీ, కొత్తగూడ, మజీద్‌బండ,HCU, ట్రిపుల్ ఐటీ, గచ్చిబౌలి మీదుగా వెళ్లాలి. వాహనదారులు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా ఈ మార్గంలో ప్రయాణించాలని పోలీసులు కోరుతున్నారు.

14వ తేదీ ట్రాఫిక్ ఆంక్షలు..

మంగళవారం(ఆగస్టు-14) సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభ కారణంగా ట్రాఫిక్ పోలీసులు సాధారణ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుం డా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు చేపట్టారు. సభకు వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలు ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా సహకరించాలని కోరుతున్నారు.
..అదిలాబాద్, నర్సాపూర్, నిజామాబాద్, కరీంనగర్, మేడ్చల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ORR మీద నుంచి ఎగ్జిట్ నెం.11 దగ్గర దిగి సితార హోటల్ పక్కన గల ఆంప్రో ప్రైవేట్ గ్రౌండ్ లేదా బొంగ్లూర్ ఎగ్జిట్ 12 దగ్గర దిగి సాగర్ కాంప్లెక్స్ దగ్గర వాహనాలను పార్కింగ్‌లో పెట్టి సభ స్థలానికి చేరుకోవాలి.
… మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, షాద్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు ORR మీదుగా బొంగ్లూర్ ఎగ్జిట్ 12 దగ్గర దిగి సాగర్ కాంప్లెక్స్ దగ్గర వాహనాలను నిలపాలి.
.. వరంగల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్ నుంచి నాగోలు వెళ్లే దారిలోఉన్న HMDA లేఔట్ పార్కింగ్‌లో వాహనాలను పార్క్ చేయాలి.
… దేవరకొండ, సాగర్ నుంచి వచ్చే వాహనాలను సాగర్ కాంప్లెక్స్ దగ్గర పార్కింగ్ చేసుకోవాలి.
… మహబూబ్‌నగర్, శ్రీశైలం వైపు నుంచి వచ్చే వాహనాలు మందమల్లమ్మ జంక్షన్ అలేఖ్య టవర్స్ వరకు సింగిల్ లైన్‌లో రోడ్డుకు  రెండువైపులా వాహనాలను నిలుపుకోవాలి.
..విజయవాడ, ఖమ్మం, సూర్యపేట, నల్గొండ మార్గంలో వచ్చే వాహనాలు ఎల్బీనగర్ సితార హోటల్ దగ్గర ఉన్న ఆంప్రో ప్రైవేట్ గ్రౌండ్‌లో వాహనాలను పార్క్ చేయాలి.
..నగరం నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు వచ్చే వాహనాలు చిత్ర లేఔట్, కూరగాయల మార్కెట్, వీఎంహోం సర్వీస్ రోడ్డు, సిరీస్ గ్రౌండ్‌లో వాహనాలను నిలపాలి.
..ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఎల్బీనగర్ ద్వారా దిల్‌సఖ్‌నగర్ వైపు వెళ్లాలనుకున్న వాహనదారులు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా రామంతాపూర్, అంబర్‌పేట్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి. వనస్థలిపురం నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లే సాధారణ వాహనదారులు చింతల్‌కుంట దగ్గర ఎడమ వైపునకు తిరిగి సాగర్‌రింగ్‌రోడ్డు, కర్మాన్‌ఘాట్ వైపు నుంచి ప్రత్యామ్నాయ రూట్లో ప్రయాణం సాగించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ ఆంక్షలు, మళ్లింపులు మంగళవారం సాయంత్రం 3 గంటల నుంచి సభ ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు  ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy