హైదరాబాద్ లో ఇస్రో సెంటర్

isroహైదరాబాద్‌లో ఇస్రో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఇస్రో చైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ ప్రకటించారు. వచ్చే అక్టోబరులో జీడిమెట్ల పరిసరాల్లో దీన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇస్రో నిర్వహించిన స్పేస్‌ మిషన్లలో సేకరించిన డేటా, పరిశోధనల ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. నగరంలో ఏర్పాటు చేసే కేంద్రంలో ఇస్రో శాస్త్ర, సాంకేతిక విభాగానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని, పరిశోధనలు చేయాలనుకునే వారికి ఆ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. అలాగే కొత్త కంపెనీలు పెట్టాలనుకునే వారికి, పరిశోధకులకు, విద్యార్థులకు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఈ డేటాతో సాంకేతిక సహాయంతో పాటు కొత్త ఐడియాలను కూడా పొందవచ్చన్నారు. అలాగే.. చమురు ఇంధనాల వాడకం తగ్గించాలన్న దేశ లక్ష్యాలకు అనుగుణంగా వాహనాలకు, ఇతర అవసరాలకు లిథియం అయాన్‌ బ్యాటరీలను వాడాల్సిన సమయం వచ్చిందని కిరణ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఆ పరిజ్ఞానానికి సంబంధించి ఇస్రో సాధించిన సాంకేతికతను వాణిజ్య అవసరాలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ బ్యాటరీలు 10-12 ఏళ్లకు పైగా పనిచేస్తాయన్నారు. నాలుగు టన్నుల బరువును రోదసిలోకి మోసుకెళ్లగలిగే శక్తిమంతమైన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 డీ1ను జూన్‌ 5న ప్రయోగించనున్నట్లు కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఇస్రో చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇస్రో పరిశోధనలు ఇప్పుడు అన్ని రంగాలకూ ఉపయోగపడుతుందన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy