హైదరాబాద్ లో ఎయిర్ ఇండియా యూనివర్సిటీ

india-air-indiaహైదరాబాదీలకు గుడ్ న్యూస్. త్వరలో ఎవియేషన్ యూనివర్సిటీ అందుబాటులోకి రానుంది. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ఎయిర్ ఇండియా… హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని నెలకొల్పడానికి రెడీ అవుతోంది. విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులకు వివిధ కోర్సులు అందించడంతో పాటు దీర్ఘకాలంలో అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి దాన్ని పెద్దఎత్తున వాణిజ్యస్థాయిలో తీర్చిదిద్దాలని భావిస్తోంది. పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది, ఆపరేషన్స్‌, ఇంజినీరింగ్‌ సిబ్బంది తదితరులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

యూనివర్సిటీగా మారనున్న సీటీఈ

ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న సెంట్రల్ ట్రెయినింగ్ ఎస్టాబ్లిష్ మెంట్(సీటీఈ) ను డీమ్డ్‌ యూనివర్సిటీగా మార్చనుంది ఎయిర్ ఇండియా. దీనిపై ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈడీసీఐఎల్‌)ను సంప్రదించింది. ఈడీసీఐఎల్‌ ఇచ్చే నివేదికపై ఆధారపడి.. యూనివర్సిటీ స్థాపించనున్నారు.  రెండు మూడు నెలల్లో నివేదిక రావోచ్చని భావిస్తున్నారు ఎయిర్ ఇండియా అధికారులు.  ప్రస్తుతం సీటీఈలో పైలట్లు, ఫ్లైట్‌ డిస్పాచర్లు, ఇంజినీర్లు, క్యాబిన్‌ సిబ్బంది, ఏవియేషన్‌ భద్రత, ఏవియేషన్‌ వైద్యం, ర్యాంప్‌ హ్యాండ్లింగ్‌ కార్గో వ్యవహారాల్లో శిక్షణ ఇస్తున్నారు.

హైదరాబాద్‌లోని శిక్షణ కేంద్రాన్ని డీమ్డ్‌ విశ్వవిద్యాలయంగా మార్చడానికి రెండేళ్ల నుంచి ఐదేళ్ల సమయం పట్టొచ్చని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయం ఏర్పాటయిన తర్వాత ఏ విమానయాన సంస్థ అయినా తమ వనరులను ఉపయోగించుకోవచ్చని లోహానీ చెప్పారు. ఎయిర్‌ ఇండియా ప్రాథమిక ప్రణాళిక ప్రకారం రాబోయే విశ్వవిద్యాలయం.. డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందజేస్తుంది. తర్వాత్తర్వాత డిగ్రీ కోర్సులు కూడా అందజేస్తుంది. పైలట్‌ శిక్షణ కోసం సీటీఈలో ఎ320 సిమ్యులేటర్లు మూడు ఉన్నాయి. ఏటీఆర్‌ 72-600 సిమ్యులేటర్‌ను సెప్టెంబరులో ఏర్పాటు చేసుకుంటారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy