హైదరాబాద్ లో ఎరుకల భవన్

రాష్ట్రంలో ఎరుకల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష జరిపారు. ఎరుకల కులానికి చెందిన వారి సామాజిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరుకల కులస్తుల విద్యా ప్రగతికి దోహదపడే విధంగా హైదరాబాద్ నగరంలో ఓ భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ ఎరుకల సంఘం అధ్యక్షుడు కూతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, మరికొందరు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిశారు. సంబంధిత శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఎరుకల భవన్ కోసం అవసరమైన స్థలం త్వరలోనే కేటాయిస్తామన్నారు సీఎం. ఈ భవన నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఎరుకుల కులస్తుల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తామని సీఎం వారికి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy