హైదరాబాద్ లో కొత్త విధానం : ఒక్క కార్డ్… అన్నీ అవసరాలకు

cardనగరవాసులకు శుభవార్త. ఇకపై అన్నీ అవసరాలకు ఒకే కార్డు విధానం రాబోతుంది. మెట్రో రైళ్లో ప్రయాణించడానికైనా, సీటీ ఒస్సు ఎక్కడానికైనా, మూవీ థియేటర్ కు వెళ్లడానికైనా, నచ్చిన హోటల్లో భోజనం చేయడానికైనా, షాపింగ్ చేయడానికి…. ఇలా ఏ అవసరానికైనా క్యాష్ లెస్ సేవలు పొందేందుకు ఓ సరికొత్త కార్డు హైదరాబాద్‌ వాసులకు త్వరలో అందుబాటులోకి రానుంది. ఒకే ఒక్క కార్డుతో ఈ సేవలన్నింటినీ పొందనున్నారు. ఈ కార్డు తయారీపై విధివిధానాల రూపకల్పనకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఓ కమిటీని నియమించబోతుంది. ఒకే కార్డుతో మెట్రో, ఆర్టీసీల్లో ప్రయాణించే విధానం దేశంలో ఇప్పటివరకూ ఢిల్లీలోనే ఉంది. 2018, జనవరిలో ఢిల్లీ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒకే టికెట్‌ తో హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో, ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించేలా గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా అమి అమల్లోకి రాలేదు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy