హైదరాబాద్ లో వాటర్ ATMలు

waterహైదరాబాద్ ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించేందుకు GHMC చర్యలు చేపట్టింది. లేటెస్ట్ టెక్నాలజీతో పని చేసే మినరల్ వాటర్ సెంటర్లను ప్రారంభిచారు మేయర్ బొంతు రామ్మోహన్. దీంతో నగరంలో ఎనీటైమ్ మినరల్ వాటర్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ATMలు ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది మొదటి సారి.

హైదరాబాద్‌లో శనివారం నాలుగు ప్రాంతాల్లో 24 గంటల పాటు మంచినీటిని ఒక రూపాయి, 2 రూపాయలతో తీసుకొనే వాటర్‌ ఏటీఎంలు ప్రారంభమయ్యాయి. జోసబ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, నేచర్స్‌ స్ర్పింగ్‌ ఎకో ట్యాప్‌ల సంయుక్త ఆధ్వర్యంలో స్వీడన్‌ టెక్నాలజీ ద్వారా GHMC, జలమండలిల సహకారంతో ఈ వాటర్‌ ATMలు పని చేస్తాయి. ప్రతి రోజు వందలాది మంది పర్యటించే NTR మార్గంలో మొట్టమొదటి వాటర్‌ ATMను గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి, కార్పొరేటర్‌ విజయారెడ్డి ప్రారంభించారు.

ఈ ఏడాది చివరి నాటికి 250 ఎనీటైం వాటర్ సెంటర్లను గ్రేటర్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మేయర్. వినియోగదారులు రూపాయి కైన్ వేసి నీటిని పట్టుకోవచ్చు. ఈ సెంటర్లను పర్యాటక, బిజినెస్ సెంటర్లతో పాటు ప్రముఖ కూడళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో ATM గంటకు వెయ్యి లీటర్లను ఫిల్టర్ చేయనుంది. ఈ 24 గంటల పాటు నీటిని అందించాలని అందించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు.

ఈ ATM లో రూపాయికి ఒక గ్లాస్ వస్తుంది. రూ.2కు లీటర్. రూ.5కు 10 లీటర్లు..10 రూపాయలకు 20 లీటర్ల మినరల్ వాటర్ వస్తుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy