హైదరాబాద్ లో విమాన ఇంజిన్ల తయారీ యూనిట్

ktr-General-Electricతెలంగాణ పారిశ్రామిక ప్రగతికి మరో ముందడుగు పడిందన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే ఏరోస్పేస్ రంగంలో తనదైన ముద్రవేసుకున్న హైదరాబాద్ నగరంలో మరొక అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు కాబోతుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత జీఈ గ్రూప్, టాటా కంపెనీ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ ఏరో స్పేస్ పార్కులో 3వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు.

ఆదిభట్లలో వైమానిక ఇంజన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు.. టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్, అమెరికా కార్పొరేట్ దిగ్గజం జీఈ ముందుకొచ్చాయి. 3వేల కోట్ల రూపాయలతో విమానాల విడిభాగాల తయారీ యూనిట్ ఇక్కడ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి జనరల్ ఎలక్ట్రిక్ చైర్మన్ జాన్ L ప్లానరీ, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ముంబైలో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ఒప్పందంతో ఎయిర్ క్రాప్ట్ కాంపోనెంట్స్ తయారీ, అసెంబ్లింగ్, టెస్టింగ్ రంగాల్లో జీఈ, టాటా కలిసి పనిచేస్తాయి. సెంటర్ అఫ్ ఏక్సలెన్స్ ఏర్పాటుచేసి.. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ తయారీకి అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయనున్నాయి. విమాన ఇంజన్ల తయారీతోపాటు.. రానున్నకాలంలో హైదరాబాద్ నుంచే వైమానిక దళానికి కావాల్సిన ఇంజిన్ల తయారీ అవకాశాలు పరిశీలిస్తామని రెండు సంస్థలు ప్రకటించాయి. ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలకు కావాల్సిన పరికరాల తయారీపై దృష్టిసారిస్తామన్నాయి.

2016 అక్టోబర్ లో అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ జీఈ చైర్మన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఢిల్లీలో జీఈ సంస్థ చైర్మన్ జాన్ L ప్లానరీతో మరోసారి సమావేశమై చర్చించారు. పెట్టుబడులపై ముందే సంకేతాలిచ్చారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఎంఓయూ పూర్తికావటంతో కేంద్ర అనుమతులు వచ్చిన వెంటనే ఆదిభట్ల సెజ్ లో పనులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఏరోస్పేస్ రంగానికి ఈ ఒప్పందం మరింత ఉతమిస్తుందన్నారు మంత్రి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy