హైదరాబాద్ లో స్వచ్ఛ ఐకాన్ పై జాతీయ సదస్సు

swachhదేశంలోని ప్రముఖ చారిత్రక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రకటించిన స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాలపై ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్ నగరంలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు.  GHMC, కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వశాఖ కలిసి ఈ సదస్సు నిర్వహించనుంది. ఈ సందస్సులో 30 ఐకానిక్ నగరాలకు ప్రాతినిధ్యం వహించే ఉన్నతాధికారులతో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన 150 మందికిపైగా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించనున్నారు. మున్సిపాలిటీ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, GHMC కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్‌రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy