
ట్రాఫిక్ సూచనలు
-ABC స్టిక్కర్స్ ఉన్న వాహనాలు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు, పరేడ్ ప్రారంభానికి ముందు మాత్రమే రావాలి. ఆ తర్వాత తిరిగి అదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది.
-సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ABC పాస్ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జం క్షన్, నాలా నగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసు కొని, బాలిక భవన్, ఆంధ్ర ఫ్లోర్ మిల్స్, ప్లె ఓవర్, లంగర్‌హౌస్, టిప్పు ఖాన్ బ్రిడ్జ్, రాందేవ్‌గూడ రైట్ టర్న్‌తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్‌కు చేరుకోవాలి. అక్కడ నుంచి వారికి కేటా యించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్కు చేయాలి. A కారు పాస్ కల్గిన వాళ్లు, గోల్కొండ కోట గేటు ఎదుట మెయిన్ రోడ్డులో ఫతే దర్వాజ రోడ్డులో, B పాస్ కల్గిన వాహనాలను గేట్ ముందు నుంచి కింది వైపుకు వచ్చి (యూసుఫ్ హోటల్ ముందు), బస్టాప్‌లలో పార్కు చేయాలి. C కారు పాస్ హోల్టర్లు గోల్కొండ ఏరియా దవాఖాన ప్రాంతంలో పార్కు చేయాలి.
* DEF కారు పాసులు కలిగిన వాహన దా రులు సేవన్ టూంబ్స్ నుంచి షేక్‌పేట్ నాలా, టోలీచౌక్ మీదుగా పోర్టుకు వెళ్లాలి. రామ్‌దేవ్‌గూడ, మాకీ దర్వాజ రూట్లలో అను మతించరు. D కారు పాస్ హోల్డర్స్ తమ వాహ నాలను ఏరియా దవాఖాన వద్ద ఆపి, పార్కింగ్ కోసం ప్రియదర్శినీ స్కూల్‌కు పంపించాలి. E, F కారు పాసులు కలిగిన వారు ఓవైసీ జీహెచ్ ఎంసీ ప్లే గ్రౌండ్లో పార్కు చేయాలి.
* E,F వాహనాలు గోల్కొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని హాకీ, ఫుట్‌బాల్ గ్రౌండ్లో పార్కు చేసుకోవచ్చు.
* వేడుకలకు హాజరయ్యే సాధారణ ప్రజలు తమ వాహనాలను హుడా పార్కు, సెవన్ టూంబ్స్ వద్ద పార్కు చేయాలి.
* వేడుకలు పూర్తయిన తరువాత ఏబీసీ కారు పాసు హోల్డర్స్ మాకై దర్వాజా, రాందేవ్‌గూడ వైపు నుంచి బయటకు వెళ్లిపోవాలి, డీ కారు పాసు హోల్డర్స్ బంజారా దర్వాజ, సెవెన్ టూం బ్స్ వైపు వెళ్లాలి. E, F పాస్ హోల్డర్స్ జమాల్ దర్వాజ, గోల్ప్ క్లబ్, సెవెన్ టూంబ్సు, సాధారణ పౌరులు ఫతే దర్వాజ, జమలై దర్వాజ వైపు నుంచి వెళ్లాలి.
* పాస్ హోల్డర్స్ పాసులను ఎడమ వైపు విండో స్క్రీన్కు అతికించాలని ఆయన సూచించారు.
రాజ్‌భవన్ రోడ్డులో…
గవర్నర్ రాజ్‌భవన్‌లో మంగళవారం(ఆగస్టు-15) సాయం త్రం 5.30 గంటలకు ఇచ్చే తేనేటి విందు సందర్భంగా రాజ్‌భవన్ రోడ్డులో సాయంత్రం 4.30 గంటల నుంచి నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కమిషనర్ మహేం దర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
* ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం వరకు రోడ్డుకు రెండు వైపులా వెళ్లే సాధారణ వాహనాలు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలి.
* VVIP లు, తెలంగాణ, ఏపీ సీఎంలు, డిప్యూటీ సీఎంలు, హైకోర్టు చీఫ్ జస్టిస్, శాసన మండలి చైర్మన్లు, స్పీకర్లు, కేంద్ర మంత్రులు, రెండు రాష్ర్టాల మంత్రులు. వీరి వాహనాలు గేట్ నెం.1 నుంచి రాజ్‌భవన్‌లోకి వెళ్లి, గేట్-2 నుంచి బయటకు రావాలి. ఈ వాహనాలను రాజ్‌భవన్ లోపల పార్కు చేయాలి.
* పింక్ కారు పాసు కలిగిన ఇతర అతిధులు, గేట్ నెం.3 నుంచి లోపలికి వెళ్లి, లోపలే పార్కు చేయాలి. అదే గేటు నుంచి బయటకు వెళ్లాలి. వైట్ కారు పాసు కలిగిన వారు గేట్ నెం.3 నుంచి ప్రవేశించి, వారి వాహనాలను MMTS పార్కింగ్ లాట్, MMTS సమీపంలోని పార్క్ హోటల్, మెట్రో రెసెడిన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదరుగా సింగిల్ లైన్లో పార్కింగ్ చేసుకోవాలి.
సికింద్రాబాద్‌లో…
పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల సందర్భంగా తివో లి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బండ్, ఎన్సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఆగస్టు 15 ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉంటాయి.