హోంగార్డులను పట్టించుకోకపోతే పోరాటం ఉద్ధృతం: కిషన్

Kishan Reddyహోంగార్డులను స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లుగా గుర్తించాలన్నారు బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి. హోంగార్డుల సమస్యలపై హోంగార్డుల సమస్యలపై బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డులకు కనీస వేతనం 19వేలు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామన్నారు కిషన్ రెడ్డి. ఆతరువాత హోంగార్డుల సమస్యలపై వినతిపత్రం అందించేందుకు నగర్ పోలీస్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లేందుకు యత్నించిన ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో రోడ్డుమీదై భైఠాయించారు కిషన్ రెడ్డి. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగడంతో ఆయన్ను ఆరెస్టు చేశారు పోలీసులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy