హోంవర్క్ గా ‘సూసైడ్ నోట్’

suicideహోంవర్క్ అంటే.. ఏ తల్లిదండ్రులైనా.. దగ్గరుండి మరీ చేయిస్తారు. పిల్లలను రెండు తగిలించి మరీ చేయిస్తారు. కానీ అక్కడి తల్లిదండ్రులు మాత్రం… టీచర్ పై విరుచుకుపడ్డారు. పిల్లలకు చెప్పేది ఇదా అంటూ మండిపడ్డారు. ఇంతకూ ఆ టీచర్ చేసిన నేరమేమిటో తెలుసా… సూసైడ్ నోట్ ను హోంవర్క్ గా ఇవ్వడమే. దీంతో షాక్ తిన్న పేరెంట్స్.. టీచర్ పై స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఇది లండన్‌లోని కిడ్‌బ్రోక్‌లో ఉన్న థామస్‌ తల్లీస్‌ స్కూల్‌లో జరిగింది. 60మంది విద్యార్థులకు ఈ సూసైడ్‌ నోట్‌ డ్రాఫ్ట్‌లను తీసుకురావాలని చెప్పింది ఇంగ్లీష్ టీచర్. షేక్‌స్పియర్‌ రాసిన మ్యాక్‌బెత్‌లో భాగంగా ఈ లేఖను హోంవర్క్ చేసుకురావాలని ఆదేశించింది. దీనిపై తల్లిదండ్రులంతా భగ్గుమనడంతో చివరకు ఆమె క్షమాపణలు చెప్పింది. అయితే దీనిలో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఇలాంటివి కూడా విద్యార్థులకు అవసరం అని మరికొంతమంది తల్లిదండ్రులు టీచర్ కు మద్దతుగా నిలిచారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy