హోమ్‌లోన్‌పై రెండున్న‌ర ల‌క్ష‌ల స‌బ్సిడీ

home-loanగృహ రుణాలు తీసుకొనే వారిని ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించింది కేంద్రం. ఏడాదికి రూ.18 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతం ఉండి.. తొలిసారి ఇల్లు కొనే వారికి హోమ్‌లోన్‌లో రూ.2.4 ల‌క్ష‌ల వ‌ర‌కు భారం త‌గ్గ‌నుంది. గృహ‌రుణాల వ‌డ్డీపై కేంద్రం స‌బ్సిడీ ఇవ్వనుంది. గ‌తంలో ఈ ఏడాది జీతం నిబంధ‌న రూ.6 ల‌క్ష‌ల‌కే ప‌రిమితం కాగా.. దానిని ఇప్పుడు 18 ల‌క్ష‌ల‌కు పెంచింది. గ‌తంలో 15 ఏళ్ల ప‌రిమితి ఉన్న గృహ‌రుణాల‌పై ఈ ఆఫ‌ర్ ఉండ‌గా.. ఇప్పుడు దానిని 20 ఏళ్ల‌కు పెంచారు. గ‌తేడాది డిసెంబ‌ర్ 31న ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద కొత్త‌గా రెండు స‌బ్సిడీ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది.
ఏడాది ఆదాయాన్ని బట్టి ఈ స‌బ్సిడీ రేట్ల‌లో తేడా ఉంటుంది. ఆరు లక్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారికి.. వారి హోమ్‌లోన్‌లో రూ. ఆరు ల‌క్షల మొత్తానికి 6.5 శాతం వ‌డ్డీని కేంద్ర‌మే భ‌రిస్తుంది. అంటే వాళ్లు ఎంత మొత్తం లోన్ తీసుకున్నా స‌రే అందులో ఆరు ల‌క్ష‌లకు మాత్రమే 6.5 శాతం వ‌డ్డీని కేంద్రం చెల్లిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ప‌ది ల‌క్ష‌ల రుణాన్ని 9 శాతం వ‌డ్డీకి గృహ‌రుణంగా తీసుకుంటే అందులో మీరు రూ.6 లక్ష‌ల మొత్తానికి 2.5 శాత‌మే వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మిగ‌తా మొత్తానికి మాత్రం 9 శాతం వ‌డ్డీ చెల్లించాలి. ఇలాగే ఏడాదికి రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న వారికి వాళ్ల మొత్తం గృహ‌రుణంలో రూ.9 ల‌క్ష‌ల‌పై 4 శాతం వ‌డ్డీని కేంద్రం స‌బ్సిడీగా ఇస్తుంది.

రూ.18 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న‌వారికి మొత్తం గృహ‌రుణంలో రూ.12 ల‌క్షలకు 3 శాతం వ‌డ్డీని కేంద్ర‌మే భ‌రిస్తుంది. అంటే ఏడాదికి 9 శాతం వ‌డ్డీతో 20 ఏళ్ల ప‌రిమితికి గృహ‌రుణం తీసుకుంటే.. ఈ మూడు కేట‌గిరీల వారికి రూ.2.4 ల‌క్ష‌ల వ‌ర‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. నెల‌వారీ ఈఎంఐ కూడా సుమారు రూ.2200 వ‌ర‌కు త‌గ్గ‌నుంది. హోమ్‌లోన్స్‌పై ఉన్న ఆదాయ ప‌న్ను మిన‌హాయింపుల‌కు ఈ స‌బ్సిడీ అద‌నం. నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌, హ‌డ్కో ఈ స‌బ్సిడీ స్కీమ్స్‌కు నోడ‌ల్ ఏజెన్సీలుగా ప‌నిచేస్తాయి.

13 Responses to హోమ్‌లోన్‌పై రెండున్న‌ర ల‌క్ష‌ల స‌బ్సిడీ

 1. Anonymous says:

  స‌బ్సిడీ సంగతి అసలు లోన్ లు సరిగా ఇవమని చేపండి

 2. Guru Raj says:

  Dhfl లో లోన్ తీసుకున్నా నాకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా

 3. Venkatappaiah immadabathuni says:

  Major private and government banks provide only urban areas…please this facility is provided rural areas also

 4. Srinivas says:

  Already 3years back loan tesukkunna variki varthisthunda

 5. Anilkumar says:

  they are not proveding loan SIR plz help us

 6. Evi cheppadanike tappa ecchedi Ledu poyedi Ledu
  Bank ki runam kosam velthe am peduthav thakattu ki ani adugutharu middle-class Valla daggara am vuntadani bank lo thakattu pettadaniki

  Plz middle class varu nammakandi asha la lokam lo vundakandi

  Asalu middle class person daggara 1year ki 18 lakhs vuntaya
  Middle class and poor people ki runalu
  Evvamu ani clear ga Direct ga cheppandi
  6 lakhs estara

 7. E.Ravi says:

  Loan 3year back loan tisukunnam maku varthistunda subsidy.

 8. Kiran says:

  Baku house lone 18 laks undhi na annuval pakeha 6 laks naku subsidy vasthundha

 9. kasi says:

  nakku loan kavale 9703284143

 10. saigoud says:

  2011 lo housing lone thisukunam maku varthinchadha

 11. Upender godugu says:

  Iam a middle class family person i have 3lakhs in my hand i want more 4lakhs in loan will they banks give us? or not?

 12. Anonymous says:

  Peparlo prakatanalake parimitam

 13. Anonymous says:

  is it true

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy