హ్యాట్సఫ్ బోర్గం: సర్కారు బడిని నిలబెట్టారు

dc-Cover-n4tm2q95mo9h0sld89pf74suf6-20160409073218.Mediఇంగ్లీష్ మీడియం చదువు. కంప్యూటర్ క్లాసులు. ఆటలు, పాటలు ఇవన్నీ ఏదో కార్పొరేట్ స్కూల్ లో కాదు. గవర్నమెంట్ పాఠశాల. సర్కార్ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు చదువులో వెనకబడిన స్కూళ్లు.. బెస్ట్ గా నిలుస్తున్నాయి. ఊరోళ్లంత కలిసి ప్రభుత్వ పాఠశాలల్లోనే  తమ పిల్లలను చదివించాలని అనుకోవడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. సీట్లు నిండి.. స్కూళ్లలో సందడి కనిపిస్తున్నది.

గవర్నమెంట్ స్కూల్స్ లో సరిగా చదువులు చెప్పారనే అనుకుంటరు అంతా. కానీ అక్కడ మాత్రం ప్రభుత్వ పాఠశాలలే బెస్ట్. ప్రైవేట్ స్కూళ్లోనైనా సీటు దొరుకుతుంది కానీ.. ఇక్కడ గవర్నమెంట్ బడిలో దొరకాలంటే కొంచెం కష్టం. నిజామాబాద్ జిల్ల మోపాల్ మండలం బోర్గం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో   స్టడీ బాగా చెప్పడంతో విద్యార్ధులు చాలా మంది వస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 12వందల మంది విద్యార్ధులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ స్కూల్ పరిస్థితులను చూసి చాలా మంది తల్లిదండ్రులు.. ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ బడికి పిల్లల్ని పంపిస్తున్నారు.

గతేడాది ఈ బడిలో 730మంది విద్యార్ధులు ఉండేవారు. ఇక్కడ చదువు మంచిగా చెప్తున్నారని అందరికీ తెలియడంతో ఈ సారి విద్యార్ధుల సంఖ్య 12వందలు దాటింది. 750 మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు.  డిజిటల్ క్లాసుల్లో చదువు చెప్పడంతో పాటు.. ఆటపాటలు, యోగా నేర్పిస్తున్నారు. మధ్యాహ్న భోజనం మంచిగా పెడుతుండడంతో ఇక్కడకు  వస్తున్నారు.

డిజిటల్ క్లాస్ తో అర్థమయ్యేలా చదువు చెప్తున్నారంటున్నారు విద్యార్ధులు. బలవంతంగా కాకుండా.. ఇష్టపడి చదివేలా చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ చదువుతో పాటు అన్ని అంశాలను నేర్చుకుంటున్నామంటున్నారు. బాల సభ పెట్టడంతో కాన్పిడెన్స్ పెరుగుతుందని .. ఎక్కడైనా మాట్లాడే ధ్యైర్యం వచ్చిందంటున్నారు.

గ్రామస్థుల సహకారంతో బడిని ఆదర్శంగా మారుస్తున్నామంటున్నారు ఉపాధ్యాయులు. బడిలో అన్ని వసతులు ఉన్నయన్నరు. డాక్టర్లను తీసుకొచ్చి విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తామని చెప్తున్నారు. ఇలా అన్ని విధాల ముందుండటంతో ఇక్కడ చదువుకునేందుకు విద్యార్ధులు పోటీపడుతుంటారన్నారు ఉపాధ్యాయులు. అటూ జగిత్యాల జిల్ల ధర్మపురి మండలం దమ్మన్నపేట ప్రభుత్వ బడిలోనూ ఈ సారి విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ఇక్కడ ఇన్నాళ్లు ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో.. అంతా ప్రైవేట్ స్కూల్ కే పంపేవారు. దీంతో  6వ, 7వ తరగతులను తీసేశారు. బడిని బతికించుకోవాలని గ్రామస్థులంతా  కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. సర్కార్ బడిలోనే ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చచెప్పి .. పిల్లల్ని సర్కార్ బడిలో చేర్పించారు.

ఈ బడిలో మొత్తం ఐదుగురు గవర్నమెంట్ ఉపాధ్యాయులు, ముగ్గురు  వాలంటీర్లు పని చేస్తున్నారు. విద్యార్ధులకు ఇంగ్లీష్ లో చదువు చెప్పేందుకు ఇద్దరు కేరళ టీచర్లను వాలంటీర్లుగా  తీసుకున్నారు.  వీళ్లకు  నెలకు 25వేల ఖర్చు అవుతోంది. బడిలో చదువుకునే విద్యార్ధుల తల్లిదండ్రులు, గ్రామ పంచాయతీ కలిసి.. వీళ్లకు జీతాలు ఇస్తున్నారు. టీచర్లు కూడా పిల్లలకు అర్థమయ్యేటట్టు డిజిటల్ పద్దతిలో పాఠాలు  చెబుతున్నారు. ధర్మపురిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. అందుబాటులో ఉన్న ప్రైవేట్ స్కూళ్లకు విద్యార్ధుల్ని పంపడంతో బడి బోసిపోయింది. దీంతో ఉపాధ్యాయులు, యువత కలిసి బడిబాట చేశారు. ఇంటింటికి తిరిగి గవర్నమెంట్ బడిలో వసతులను, చదువు చెప్పే పద్ధతి మీద  తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో ఈ ఏడాది 150 మంది విద్యార్ధులు కొత్తగా చేరి చదువుకుంటున్నారు.

ఇంగ్లీష్ మీడియం చదువులతో సర్కార్ బడులు నాణ్యమైన విద్యను చెప్తున్నాయి. దీంతో ఏటుకేడు విద్యార్ధుల సంఖ్య పెరుగుతుంది. అన్ని సర్కార్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మరిన్ని వసతులు కల్పిస్తే బాగుంటదంటున్నరు తల్లిదండ్రులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy