హ్యాట్సాప్ క్యాబ్ డ్రైవర్ : అవసరాల కంటే విలువలకే విలువ

cab-driverఆ మనిషి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఊహించని విధంగా కళ్లెదుట తనది కాని కట్టల డబ్బు ప్రత్యక్షం అయ్యాయి.. ఇప్పుడు చెప్పండి అతను డబ్బులు వాడుకుంటాడా.. తన డబ్బు కాదంటూ విలువలు చెబుతాడా.. బయటకు ప్రతి ఒక్కరూ విలువలే అన్నా.. లోపల మాత్రం ఎవరిదో తెలియనప్పుడు తీసుకుంటేపోలా.. దేవుడే ఇచ్చాడు అనుకుని సర్దేసుకుంటారు కొందరు వ్యక్తులు. కానీ కరెన్సీ కంటే.. వ్యాల్యూస్ కే ఎక్కువ విలువ ఇచ్చాడు ఢిల్లీలోని క్యాబ్ డ్రైవర్ దేబేంద్ర కాప్రీ. దొరికిన డబ్బును ఏం చెయ్యాలో చేసి చూపించాడు.

ఆర్థికంగా రోజురోజుకు చితికిపోతున్నా.. పరుల సొమ్ములో రూపాయి ముట్టుకోకుండా మొత్తం నోట్ల కట్టలను పోలీసులకు అప్పగించాడు దేబేంద్ర. ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కాశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తి క్యాబ్ ఎక్కి ఎయిర్ పోర్టులో దిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ట్యాక్సీ క్లీన్ చేసుకుంటున్నాడు. దేబేంద్రకు వెనకసీట్లో ఓ బ్యాగ్ కనిపించింది. ప్యాసింజర్ కు బ్యాగ్ తిరిగి ఇచ్చేద్దామని నిర్ణయించుకుని.. ఎయిర్ పోర్ట్ లో తిరిగాడు. అయితే అతన్ని సరిగా గుర్తుపట్టే అవకాశం లేదు. కనీసం పేరు కూడా తెలియదు. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని బ్యాగ్ ఓపెన్ చేసి చూశాడు. అందులో కెమేరా, ఐఫోన్, ల్యాప్ టాప్, డాలర్ల కట్టలు, బంగారు నగలు ఉన్నాయి. వాటి విలువ 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇంత విలువైన వస్తువులను ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వటం బాగుండని.. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. బ్యాగ్ అప్పగించాడు. పోలీసులు రెగ్యులర్ గానే ఓపెన్ చేసి చూశారు. షాక్ అయ్యారు. నీకు తెలుసా ఈ బ్యాగ్ లో ఏమున్నాయో.. వాటి విలువ ఎంతో అని అడిగారు. తెలుసుకానీ.. వాటితో నాకు అవసరం లేదు.. ఆ డబ్బు, వస్తువులు నావి కాదు కదా అన్నాడు దేబేంద్ర. ఈ వస్తువులు సొంత మనిషికి చేరాలని పోలీసులతో ప్రామిస్ చేయించుకున్నాడు.

ఎంతైనా ఖాకీలు కదా.. దేబేంద్ర నిజమే చెబుతున్నాడు.. మధ్యలో ఏమైనా డబ్బు నొక్కేశాడా అనే డౌట్ వచ్చింది. వెంటనే ఎంక్వయిరీ చేశారు. దేబేంద్రకు రూ.3లక్షల అప్పు ఉంది. సొంతూరు బీహార్. సోదరి పెళ్లికి లక్ష అప్పు చేశాడు తండ్రి. ఆ అప్పు రెండేళ్లలో 2 లక్షలు అయ్యింది. అప్పు తీర్చడానకి పదో తరగతి మానేసి..  ఇంటిని వదిలి గుజరాత్ చేరాడు. అక్కడి నుంచి ఢిల్లీ వచ్చాడు. క్యాబ్ డ్రైవర్ గా చేస్తూ.. అనారోగ్యంగా ఉన్న తల్లిని.. వయసుమీదపడిన తండ్రిని చూసుకుంటున్నాడు దేబేంద్ర. ఇన్ని కష్టాలున్నా.. 22 ఏళ్ల దేబేంద్ర ఎప్పుడూ వెనకడుగు వెయ్యలేదు. నవ్వుతూ కష్టాల కడలిని ఈదుతున్నాడు. దేబేంద్ర నేపధ్యం, కుటుంబ కష్టాలు తెలిసిన తర్వాత ఈ వార్త జాతీయ స్థాయిలో హల్ చల్ చేస్తుంది. క్యాబ్ డ్రైవర్ కు హ్యాట్సాప్ చెబుతూ కొందరు అయితే ఆర్థిక సాయం చేయటానికి ముందుకు రావటం విశేషం..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy