హ్యాపీడేస్ టైసన్ కు బిగ్ ఆఫర్

rahulహ్యాపీడేస్ సినిమాలో శ్రావ్స్.. శ్రావ్స్.. అంటూ అలరించిన రాహుల్.. తన పేరు కంటే టైసన్ గానే ప్రజల్లో ఇమేజ్ సంపాదించాడు. హ్యాపీడేస్ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ట్రెండ్ కు తగ్గట్టుగా సిక్స్ ప్యాక్ తో కూడా సర్ప్రైజ్ చేశాడు. తాజాగా రాహుల్ హీరోగా నటించిన వెంకటాపురం చిత్రం మే నెలలోనే విడుదల కానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కేవలం ట్రైలర్స్ తోనే ఇంట్రస్టింగ్ మూవీగా పబ్లిక్ లో టాక్ సంపాదించింది. వెంకటాపురం ట్రైలర్స్ తోనే రాహుల్ కు కోలీవుడ్ లో పెద్ద సంస్థ అయిన “కె ప్రొడక్షన్స్ బ్యానర్’’ నుంచి ఊహించని ఆఫర్ వచ్చింది. బాహుబలి-2 సినిమాను తమిళంలో రిలీజ్ చేసి సౌత్ ఇండియాలోనే ఒన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటిగా పేరుగాంచిన ‘‘కె ప్రొడక్షన్స్’’ బ్యానర్ నిర్మించబోతున్న మూవీలో రాహుల్ ను హీరోగా సెలెక్ట్ చేసుకుంది.  తెలుగు మార్కెట్లోకి ఎంట్రీని హీరో రాహుల్ చిత్రంతోనే ఇవ్వడం విశేషం. తమిళ హీరో ధనుష్ డైరెక్షన్ లో వచ్చివ ‘పవర్ పాండీ’’ చిత్రం ఈ బ్యానర్ లోనే వచ్చింది. ప్రస్తుతం ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వస్తున్న ‘‘ఎనై నాకోయ్ పాయుంతోటి’’తో పాటు.. రానా, రెజీనా జంటగా 1945 అనే పీరియాడకల్ మూవీని తెలుగు,తమిళ భాషల్లో రూపొందిస్తుంది కె ప్రొడక్షన్ బ్యానర్. ‘వెంకటాపురం’ ప్రీమియర్ చూసిన కె ప్రొడక్షన్స్ టీమ్ కు రాహుల్ నటన రియలిస్టిక్ గా ఉండటంతో అతన్నే హీరోగా ఫిక్స్ చేశారు. డిఫరెంట్ లుక్.. డైలాగ్స్.. బాడీ లాంగ్యేజ్.. డిఫరెంట్ మేకోవర్ తో వైవిధ్యంగా ఈ చిత్రం ఉండబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. రంగరాజు అనే కొత్త దర్శకుడిని కూడా ఈ చిత్రం ద్వారా పరిచయం చేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో ఫుల్ గ్రాఫిక్స్ తో నిర్మించబడుతుందని.. జూలైలో మొదలు కానున్న ప్రాజెక్ట్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది చిత్ర యూనిట్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy