హ్యాపీ చిల్ర్డన్స్ డే: పిల్లలు.. దేవుడు.. చల్లనివారే

childrens-day-indiaనేటి బాలలే రేపటి పౌరులు. అందుకే బాలలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుకే చిన్నారులంటే మాజీ నెహ్రుకు ఎనలేని ప్రేమ. నెహ్రూ అన్న కూడా బాలలకు ఎంతో ఇష్టం. అందుకే బాలలపై నెహ్రూకు కు ఉన్న ప్రేమకు గుర్తుగా ఆయన పుట్టినరోజునే దేశ వ్యాప్తంగా బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నాం.

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు. దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుంది. ప్రతిభవంతులైన పౌరులు సమాజాన్ని ప్రగతిపథంలో నడిపిస్తారు. అందుకే బాలలుగా ఉన్నప్పుడే వారిని సన్మార్గంలో నడిపించాలి. పసి హృదయాల్లో ఎలాంటి కల్మషం ఉండదు. అందుకే చిన్నారులను అందరూ ఇష్టపడతారు.

దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రుకు కూడా చిన్నారులంటే ఎంతో ఇష్టం. అందుకే పసివాళ్లను గులాబీలతో పోల్చారాయన. చిన్నారులపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఎప్పుడు ఎదపై గులాబీ ధరించేవారు. నెహ్రూ ఆశయాలను, ఆదర్శాలను స్మరించుకుంటూ ఆయన పుట్టిన రోజునే దేశ వ్యాప్తంగా చిల్డ్రన్స్ డే గా నిర్వహిస్తున్నారు.

పిల్లలతో నెహ్రూకున్న అనుబంధం ప్రత్యేకమైనది. చిన్నారులను పువ్వుల్లాగా సున్నితంగా చూడాలన్నారు నెహ్రు. విలువలతో కూడిన సమాజం నిర్మాణానానికి మూలం పిల్లలేనని నమ్మేవారు చాచాజీ. అందుకే ఎక్కువగా పిల్లలతో గడిపేందుకు ఆయన ఇష్టపడేవారు. బాలలతో సరదగా గడుపుతూ వారికి జీవితా పాఠాలు నేర్పేవారయన. పిల్లలపై నెహ్రూ చూపిన ప్రేమ ఆయనకు చాచా అనే బిరుదును తెచ్చిపెట్టింది.

బాలల దినోత్సవాన్ని స్కూళ్ళలో సెల్ఫ్ గవర్నింగ్ డే గా జరుపుకొంటారు చిన్నారులు. అన్నీ తామై ఈ ఒక్క రోజు స్కూల్ నడిపించి ఎంజాయ్ చేస్తారు. క్విజ్, కల్చరల్ ప్రోగ్రామ్స్, దేశ భక్తి గీతాలు, డాన్స్ లతో సందడిచేస్తారు. అందుకే నవంబర్ 14 అంటే చిన్నారులకు పండగే. ఈ రోజు కోసం పిల్లలేకాదు పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. తమ పిల్లలను నచ్చినట్టుగా తయారు చేసి మురిసిపోతుంటారు పేరెంట్స్.

బంగారు భవిత బాలల సొంతం. దేశ భవిష్యత్తు చిన్నారుల చేతుల్లోనే ఉంది. అందుకే కల్మషం లేన హృదయం, మకుటం లేని మనుసుతో ముద్దులొలికే చిన్నారులను..నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా పెంచాల్సిన బాధ్యత పేరెంట్స్ పై ఉంది. సో పిల్లలందరికి చిల్డ్రన్స్ డే విషెష్ చెబుతోంది V6.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy