హ్యాపీ జర్నీ : మైండ్ స్పేస్ అండర్ పాస్ ప్రారంభం

Underpass-at-Mind-Spaceహైటెక్ సిటీ సమీపంలోని మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర అండర్ పాస్ ప్రారంభం అయ్యింది. ఏప్రిల్ 28వ తేదీ శనివారం మధ్యాహ్నం నుంచి రాకపోకలు మొదలయ్యాయి. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఓపెన్ అయ్యింది. హైటెక్ సిటీ – బయోడైవర్సిటీ వైపు వెళ్లే వాహనాలు ఇక నుంచి జంక్షన్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. అండర్ పాస్ నుంచి నేరుగా వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం ఈ జంక్షన్ నుంచి గంటకు 14వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో పదేళ్లకు ఈ సంఖ్య 30వేలుగా ఉండొచ్చని అంచనా. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థలో భాగంగా ఈ అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. అందులో భాగంగా ఇది రెండోది.

ఈ ప్రాజెక్ట్ కోసం రూ.25 కోట్లు ఖర్చు చేశారు. రెండేళ్లలో పూర్తి చేశారు. 368 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పుతో ఈ అండర్ పాస్ నిర్మాణం జరిగింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy