హ్యాపీ బర్త్ డే అటల్ జీ.. రాజనీతిజ్ఞతకు మరోపేరు

atal_2 (1)ఆయన వాక్ ప్రవాహంలో… హాస్యం ఉంటుంది… ఆవేశం ఉంటుంది. గిలిగింతలు పెట్టగలరు.. అంతలోనే ఉద్వేగం రగిలించగలరు. రెండు సీట్ల పార్టీని… దేశ రాజకీయ యవనికపై అధికార పార్టీగా మలిచిన రాజకీయ దురంధరుడు ఆయన. ప్రజాసేవే ధ్యేయంగా జీవితాన్ని త్యాగం చేసి… భారతరత్నగా వెలుగొందుతున్న ఆయనే భారత మాజీ ప్రధాని.. బీజేపీ లెజెండ్ అటల్ బిహారీ వాజ్ పేయి. ఆయన పుట్టిన రోజు ఇవాళ.

వాజ్ పేయి… రొటీన్ రాజకీయ నాయకుడు కాదు. జీవితాన్ని దేశంకోసం, పార్టీకోసం డెడికేట్ చేసిన దార్శనికుడు. అరుదుగా కనిపించే రాజనీతిజ్ఞడు. అరవై ఏళ్లకు పై బడ్డ పొలిటికల్ లైఫ్ వాజ్ పేయి సొంతం. మూడు సార్లు ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాయకుడు.

వాజ్ పేయి హయాంలో…  ఇండియా సక్సెస్ గ్రాఫ్ చాలా మెరుగుపడింది. భారతదేశ సత్తా ను ప్రపంచానికి చాటిన పోఖ్రాన్ – 2 అణు పరీక్షలు నిర్వహించింది వాజ్ పేయే. ఆయన పాలనలోనే ‘ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ’  పేరుతో రోడ్లను విస్తరించారు. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు …..వాజ్ పేయి బ్రెయిన్ చైల్డ్. వాజ్ పేయి ప్రాజెక్టుల ఫలితంగా, దేశంలోని  చిన్నా చితకా ఊళ్లకు కూడా  పెద్ద పెద్ద నగరాలతో  రవాణాపరంగా లింక్ ఏర్పడింది.

RSS, పాత జనసంఘ్ నుంచి లీడర్ గా ఎదిగివచ్చినా, ముస్లిం ప్రపంచంలో కూడా అభిమానులను సొంతం చేసుకున్నారు వాజ్ పేయ్. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా  ఏర్పడ్డ ఎన్డీయే కూటమికి సెక్యులర్ ఫేస్ ఇవ్వడానికి ట్రై చేశారు. 2009లో హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత, యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు వాజ్ పేయి.

విధానాల్లో రవ్వంత తేడా వస్తే, పార్లమెంటు సాక్షిగా పండిట్ నెహ్రూ లాంటి వాళ్లను కూడా కడిగి పారేసిన, వాజ్ పేయి…. వ్యక్తిగతంగా గొప్ప హాస్య ప్రియుడు. వాడివేడి ప్రసంగాలు చేయడంలోనే కాదు, అలవోకగా జోకులు పేల్చడంలోనూ ఆయనకు ఆయనే సాటి. మధ్యమధ్యలో  కవిత్వాన్ని కలగలిపి, అధికార పక్ష సభ్యుల చేత కూడా శెహభాష్ అనిపించుకునేలా పార్లమెంటులో స్పీచులిచ్చిన గొంతు…..ఇప్పుడు  రెస్ట్ తీసుకుంటోంది.

2014లో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్… వాజ్ పేయికి సముచిత గౌరవాన్ని ఇచ్చింది.  ఆయన పుట్టినరోజును సుపరిపాలనా దినోత్సవంగా జరుపుతోంది. ఆయన సేవలకు గానూ 2015లో భారతరత్నతో సత్కరించింది.  అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రొటోకాల్ ను పక్కన పెట్టి… వాజ్ పేయి నివాసానికి వెళ్లి మరీ.. భారతరత్న పురస్కారాన్ని అందించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy