
నరేంద్ర మోడీ. భారత 15వ ప్రధాని. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రికార్డులు తిరగరాస్తూ.. బీజేపీని తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చారు. పీఎం సీటులో కూర్చున్నారు. గుజరాత్ అభివృద్ధిని చెప్పుకుంటూ.. దేశంలో సంస్కరణలు తీసుకొస్తానని… మార్పు మంత్రంతో పీఎం పోస్టుకు క్వాలిఫై అయ్యారు నమో. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ మెహ్ సానా జిల్లాలోని వాద్ నగర్ లో పుట్టారు మోడి. తండ్రి దామోదర్ దాస్ ముల్ చంద్. తల్లి హీరాబెన్ లకు… మూడో సంతానం…. మోడీ. వెనకబడిన కుటుంబంలో పుట్టిన నమో.. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ కు అట్రాక్ట్ అయిన మోడీ… లక్ష్మణ్ రావు ఇనామ్ దార్ గైడెన్స్ తో ఎదిగారు. బీజేపీ పుట్టకముందు… భారతీయ జన సంఘ్ లో యాక్టివ్ గా ఉన్నారు. ఎమర్జెన్సీ టైంలో 1975-77 మధ్య అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అండర్ గ్రౌండ్ లోకెళ్లారు. ఏబీవీపీలో కీలకంగా పనిచేశారు. అప్పుడే మోడీలో నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్ కే అద్వానీకి బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా అద్వానీ అనుచరుడిగా బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారాయన. 2001లో బుజ్ భూకంపంతో నాటి గుజరాత్ సీఎం కేశూభాయ్ పటేల్ గద్దెదిగాల్సి వచ్చింది. దాంతో నరేంద్ర మోడీ సీఎంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు అధికారంలోకొచ్చింది బీజేపీ. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీచినా.. గుజరాత్ ను ఎదురులేకుండా ఏలారాయన.
గుజరాత్ అభివృద్ధి, అవినీతి నిర్మూలన ముద్రతో ప్రధాని అభ్యర్థి రేసులోకి అనూహ్యంగా దూసుకొచ్చారు నమో. సీనియర్లు ఎంతో మంది ఉన్నా… అందర్నీ వెనక్కి నెట్టి రేసులోకొచ్చారు. అద్వానీ లాంటి సీనియర్ లీడర్ల నుంచి వ్యతిరేకత వచ్చినా…. ఆర్ఎస్ఎస్ అండతో ఏకంగా ప్రధాని పదవిని చేపట్టారు. ప్రతీ పుట్టిన రోజునాడు తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకోవడం…. ఆమె తయారుచేసిన స్వీట్ తిన్న తర్వాతే మిగతా కార్యక్రమాల్లో పాల్గొనడం మోడీ అలవాటు. ఇక 65వ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు ముందే అడ్వాన్స్డ్ విషెస్ చెప్పారు. ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్.. ఓ రోజు ముందే కలిసి శుభాకాంక్షలు చెప్పారు. బ్యాడ్మింటన్ రాకెట్ ని ప్రజెంట్ చేసింది. సైనా ప్రధానిని కలిసింది. మోడీ బర్త్ డే సందర్భంగా ఆయన సొంత నియోకవర్గం వారణాసివాసులు ఆయనకు స్వచ్ఛ్ కాశీని గిఫ్ట్ గా ఇస్తామని ప్రామిస్ చేయబోతున్నారు. ఇక ఆయన బర్త్ డే సందర్భంగా ఏబీవీపీతో పాటు బీజేపీ యూత్ వింగ్ ఐదు కొత్త పథకాలను అమలు చేయబోతున్నాయి.