
సృష్టికి మూలం అమ్మ. దేవుని ప్రతిరూపం అమ్మ. అందుకే మాతృదేవోభవ అంటారు. అమ్మ రుణం తీర్చాలంటే అమ్మగా పుట్టాల్సిందేనని చెబుతారు. స్ర్తీ జన్మ పరిపూర్ణం అయ్యేది కూడా అమ్మ అయితేనే . అమ్మ మంచితనన్ని చెప్పే కవితలు, పాటలు ఎన్నోఉన్నాయి. బిడ్డకు ఏ కష్టమెచ్చిన కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అమ్మ చనువాల రూపమే మానవ జన్మ అంటరు…కవులు. శ్రీరామ రక్ష అంటూ , దీర్ఘాయురస్తు అంటూ నిత్యం పూజిస్తుంటుంది.
అమ్మ త్యాగాలకు గుర్తుగా చేసుకునేదే మదర్స్ డే. ప్రపంచ వ్యాప్తంగా పలు తేదీల్లో ఈ మదర్స్ డే జరుపుకుంటారు. ఆసియా, దక్షిణ దేశాల్ల ప్రతీ ఏడాది మే నెల రెండో ఆదివారం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. మదర్స్ డే జరుపుకోడానికి ఓ రోజు ఎందుకని అంటారు చాలా మంది. అసలు అమ్మను మర్చిపోతే కదా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అని ప్రశ్నించే వారు లేకపోలేదు. ఏమిచ్చి అమ్మ రుణం తీర్చుకోగలం చెప్పండి…. అందుకే అమ్మ త్యాగాలకు, సేవలకు ఓ వందనం.