హ్యారీపోటర్ పుస్తకాలు.. హాట్ కేకులే

"Harry Potter & The Cursed Child" - Book Release At Foylesహ్యారీపోటర్ సిరీస్ లో ఎనిమిదో పుస్తకం రిలీజైంది. ‘హ్యారీపోటర్ అండ్ ది కర్స్‌డ్‌ ఛైల్డ్‌’ పేరుతో రిలీజైన ఆ బుక్.. హాట్ కేకుల్లా అమ్ముడైపోతోంది. ప్రపంచం హ్యారీ ఫీవర్ తో ఊగిపోతోంది. దుకాణాలు జనంతో నిండిపోయాయి. ఇండియాలోనూ అంతే రష్. మెట్రో సిటీలైన ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్ కతాలలో జనం ఎగబడ్డారు. ఆదివారం ఆ పుస్తక రచయిత్రి జేకే రౌలింగ్ పుట్టిన రోజు కావడంతో అదే రోజు రిలీజ్ చేశారు.  భారత్‌లో అయితే ఒక్క రోజులో 1.7 లక్షల పుస్తకాలు అమ్ముడైనట్లు ఇండియాలోని దాని పబ్లిషర్ హషెట్‌ తెలిపింది. హ్యారీపోటర్ సిరీస్ లో ఈ పుస్తకానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇంతకు ముందు వచ్చిన అన్ని పుస్తకాలు నవలలు అయితే ఇదిమాత్రం నాటిక కావడం విశేషం. తొమ్మిదేళ్ల తర్వాత రావడంతో దీనికి మరింత గిరాకీ పెరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఏడు నవలలు మొత్తం 50 కోట్ల పుస్తకాలు అమ్ముడయ్యాయి. ఈ పుస్తకాన్ని జేకే రౌలింగ్‌ మాత్రమే కాకుండా మాటల రచయిత జాన్‌ థోర్న్‌, దర్శకుడు జాన్‌ టిఫనీ కూడా రాశారు.

హ్యారీపోటర్ సిరీస్…

  • 1997- మొదటి పుస్తకం హ్యారీపోటర్‌ అండ్‌ ఫిలాసఫర్‌ స్టోన్‌
  • 1998- రెండో పుస్తకం ఛాంబర్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌
  • 1999- ప్రిజనర్‌ ఆఫ్‌ అజ్‌కబాన్‌
  • 2000- ది గోబ్లెట్‌ ఆఫ్‌ ఫైర్‌
  • 2003- ది ఆర్డర్‌ ఆప్‌ ది ఫోనిక్స్‌
  • 2005- ది హాఫ్‌ బ్లడ్‌ ఫ్రిన్స్‌
  • 2007- ది డెత్లీ హాలోస్‌
  • 2016- ది కర్స్‌డ్‌ ఛైల్డ్‌

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy