10% రిజర్వేషన్ లో కాపులకు 5% : ఏపీ సీఎం చంద్రబాబు

ఆర్ధికంగా వెనుకబడిన వారికి కేంద్రం ఇస్తున్న 10 శాతం రిజర్వేషన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం తెచ్చిన 10% కోటాలో 5% కాపులకు ఇచ్చామన్నారు సీఎం చంద్రబాబు. మిగిలిన 5% రిజర్వేషన్ ను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS) పేదలకు ఇస్తామన్నారు. మంత్రివర్గ సమావేశంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు.

కేంద్రం అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నట్లు చట్టం చేసిందనీ, అయితే అందులో 5 % రిజర్వేషన్ ఇవ్వాలని తాము ఎప్పుడో కోరామని స్పష్టం చేశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తే… బీజేపీ నేతలు ఒప్పుకోలేదని తెలిపారు.

ఇప్పుడు కేంద్రం తెచ్చిన 10% కోటాలో 5 % కాపులకు ఇచ్చామని చంద్రబాబు అన్నారు. మిగిలిన 5 % రిజర్వేషన్ ను EWS పేదలకు ఇస్తామని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy