10 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ అట..!

JOBS 10 lakhsనిరుద్యోగులకు శుభవార్త. న్యూ ఇయర్ లో ఉద్యోగాల పంట పండనుంది. ఈ ఏడాది కనీసం 10 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశముందని మైహైరింగ్‌క్లబ్‌.కామ్‌ అంచనా వేస్తోంది. అదే సమయంలో వేతనాలు కూడా 10-30 శాతం పెరిగే అవకాశముందని చెబుతోంది. 5,480 కంపెనీలను సర్వే చేసిన ఇంకా ఏమన్నదంటే….

 

 

 

  • ఆర్థిక వృద్ధిపై సానుకూలత, వివిధ రంగాల్లో స్టార్టప్ కంపెనీలు కూడా వస్తుండటంతో  ఉద్యోగావకాశాలు విపరీతంగా పెరిగే అవకాశముందని తెలిపింది.
  • డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియాల కారణంగా మానవ వనరులకు గిరాకీ అధికం కానుంది. ఇ-కామర్స్‌ రంగంతో పాటు స్టార్టప్‌ కంపెనీల రాక కారణంగా ఉద్యోగాలు అధికం కానున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు కూడా అడుగుపెడుతుండడం కూడా కలిసొచ్చే కాలమంటున్నారు.
  • నైపుణ్యం ఎక్కువ ఉన్నవారికి మంచి వేతనాలు దొరకొచ్చని చెబుతున్నాయి హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ నిపుణులు. 2016లో సగటున 12-14 శాతం మేర వేతనాలు పెరగొచ్చని; ముఖ్యమైన వ్యక్తులకు 25-30 శాతం మేర జీతాలు అధికం కావొచ్చని అంచనా.
  • ఐటీలోనే 2.7 లక్షల ఉద్యోగావకాశాలు కనిపిస్తున్నాయని ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రితుపర్ణ చక్రవర్తి అంటున్నారు. ఇక ఇ-కామర్స్‌లో 1.5 లక్షల నియామకాలు జరగొచ్చనీ అంచనా వేస్తున్నారు. ఉద్యోగ నియామకాలు ఎక్కువగా జరిగే రంగాల్లో డిజిటల్‌ మార్కెటింగ్‌(1.5 లక్షలు), బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలు(3 లక్షలు) ఉన్నాయి.
  • కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఈ ఏడాది సానుకూలంగా కనిపిస్తోందని నౌకరీ.కామ్‌ అంటోంది. ఐటీ/ఐటీఈఎస్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) వంటి రంగాల్లో రానున్న ఏడాదుల్లోనూ నియమాకాలు కొనసాగనున్నాయని అంచనా వేస్తోంది. ప్రస్తుత సంవత్సరం తొలి మూడు నెలల్లో దాదాపు 42 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఉద్యోగ అంచనాలు మెరుగ్గా ఉన్నాయని గ్లోబల్‌ స్నాప్‌షాట్‌ అనే నియమాక సంస్థ అంటోంది. ఇంజినీరింగ్‌, ఐటీఈఎస్‌, ఔషధ, ఇ-కామర్స్‌, వాహన రంగాలతో పాటు.. బయోసైన్స్‌ రంగంలోనూ ఉపాధి అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy