100 రోజులు పూర్తి చేసుకున్న ‘బాహుబలి-2’

5BRK74Bతెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ‘బాహుబలి-2’ సినిమా నేటి (ఆగస్టు-5)తో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు, పది రోజుల్లోనే రూ.వెయ్యి కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా రికార్డులు తిరగరాసింది. దర్శక దీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రికార్డులు బద్దలు కొట్టింది. అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలతో పోటీపడి కలెక్షన్ల వర్షం కురిపించింది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్‌, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy