1092 పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

gandhiవైద్య ఆరోగ్య శాఖలో 1092 పోస్టులకు కేసీఆర్ ఆమోదం లభించింది. రాష్ట ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు అసోషియేట్ , అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులతోపాటు  లెక్చరర్స్, డాక్టర్లు,నర్సులు, హెల్పర్స్, రికార్డు క్లర్క్స్, స్టోర్ కీపర్లు, సామాజిక ఆరోగ్య కార్యకర్తల పోస్టులకు ఇటీవల ఆర్థికశాఖ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా సీఎం వద్దకు ఈ ఫైల్ వెళ్లగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. త్వరలోనే పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని చెబుతున్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. రేడియోథెరపీలో 1 యూనిట్‌ చొప్పున మొత్తం 115 కొత్త యూనిట్లను వేర్వేరు విభాగాల్లో కొత్తగా సృష్టించారు.

ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే..

వివిధ విభాగాల్లో

అసోషియేట్  ప్రొఫెసర్స్ ఖాళీలు – 99

అసిస్టెంట్ ప్రొఫెసర్స్ – 198

స్టాఫ్‌నర్సులు 463

టెక్నికల్ హెల్పర్స్ – 77

ల్యాబోరేటరీ హెల్పర్స్- 52

స్టోర్‌ కీపర్లు-34,

పిల్లల సైకాలజిస్టులు- 5

సోషల్ యాక్టివిస్ట్స్- 16,

హెల్త్‌ ఎడ్యుకేటర్లు- 5,

డార్క్‌రూమ్‌ హెల్పర్స్- 5,

స్టెనో టైపిస్టులు- 63

రికార్డు క్లర్కులు- 75

పోస్టుల చొప్పున మొత్తం 1,092 పోస్టుల భర్తీకి  సీఎం అనుమతి లభించింది.

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy