11వ అంతస్తు నుంచి దూకుతుంటే కాపాడబోయి…

china incidentఅంతెత్తు నుంచి ఎవరైనా కిందకు పడుతూ ఉంటే.. చూస్తూ ఎవరూ కూర్చోలేరు. సాధ్యమైనంత వరకు రక్షిద్దామనే అందరూ ప్రయత్నిస్తారు. ఇలాగే ప్రయత్నించి విఫలమయ్యాడో వ్యక్తి. మాజీ సైనిక ఉద్యోగి అయిన ఆయన… ఓ అపార్ట్ మెంట్ లోని 11వ అంతస్థు నుంచి ఓ మహిళ దూకడానికి రెడీ అవ్వడం చూశాడు. స్పీడ్ గా ఆ ఫ్లోర్ ఎక్కుదామని ట్రై చేశాడు. అయితే అంతలోపే ఏమైనా జరగొచ్చని భావించి అక్కడి నుంచే రక్షద్దామనుకున్నాడు. కానీ దురదృష్టం ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.  వేగంగా కిందకు పడుతున్న ఆమెను పట్టుకోలేకపోయాడు. చివరకు నేలను బలంగా తాకి చనిపోయింది. ఈ ఘటన ఈ నెల 23న చైనాలోని హూబే ప్రావిన్సులో జరిగింది. అక్కడి సీసీ కెమేరాల్లో ఈ విడియో రికార్డయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy